Homeఎంటర్టైన్మెంట్DC Movie : డిజాస్టర్ కోసం 'DC' చిత్రాన్ని వదులుకున్న యంగ్ హీరో అతనేనా.. చేతులారా...

DC Movie : డిజాస్టర్ కోసం ‘DC’ చిత్రాన్ని వదులుకున్న యంగ్ హీరో అతనేనా.. చేతులారా కెరీర్ ని నాశనం చేసుకున్నాడుగా..

DC Movie : ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘DC ‘ రీసెంట్ గానే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ కి డైరెక్టర్ గా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది , బడా సూపర్ స్టార్స్ అందరూ ఆయనతో సినిమా చేయడానికి ఎగబడుతుంటారు. కానీ హీరో గా […]

DC Movie : ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘DC ‘ రీసెంట్ గానే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ కి డైరెక్టర్ గా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది , బడా సూపర్ స్టార్స్ అందరూ ఆయనతో సినిమా చేయడానికి ఎగబడుతుంటారు. కానీ హీరో గా సినిమా చేస్తానంటే మాత్రం ఆరంభం లో పెద్దగా ఆడియన్స్ లో ఆసక్తి ఉండేది కాదు. అలా చాలా తక్కువ అంచనాల మధ్యనే ఈ సినిమా విడుదలైంది. కానీ ఆడియన్స్ ని అద్భుతమైన కంటెంట్ , స్క్రీన్ ప్లే , మ్యూజిక్ తో తిరుగులేని థియేట్రికల్ అనుభూతిని కలిగించింది ఈ చిత్రం. ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

సహజత్వానికి చాలా దగ్గరగా, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో ఇలాంటి రివెంజ్ డ్రామా ని ఈమధ్య కాలం లో చూడలేదని, ముఖ్యంగా అనిరుద్ అందించిన మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉందని , ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాని అందించినందుకు డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ కి ప్రత్యేకించి కృతఙ్ఞతలు చెప్తూ , ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు నెటిజెన్స్. అయితే ఈ సినిమా కథని డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ ముందుగా మన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కి వినిపించాడట. ఆయనకు కథ బాగా నచ్చింది కానీ , అదే సమయం లో ‘కింగ్డమ్’ చిత్రం చేస్తుండడం , రెండు సినిమాల ప్లాట్స్ ఒకే లాగా ఉండడం తో ఆ సమయం లో రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపించాయి. విజయ్ దేవరకొండ కూడా ఒక ఇంటర్వ్యూ లో అరుణ్ మాతేశ్వరన్ తో సినిమా మిస్ అయిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇంతటి అద్భుతమైన సినిమాని ఎలా మిస్ అయ్యావు , ఈ చిత్రం నువ్వు చేసుంటే ఎంత పెద్ద హిట్ అయ్యేదో తెలుసా?, ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యేవాడివి అంటూ సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ అభిమానులు , ఆయన్ని ట్యాగ్ చేసి బాధపడుతూ పోస్టులు వేస్తున్నారు. ఒక డిజాస్టర్ కోసం ఇంతటి అద్భుతమైన కథ ని మిస్ చేసుకున్నాడు అనే విషయాన్నే ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఇప్పటి నుండైనా స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటూ ఆయనకు సలహాలు ఇస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతుల్లో ‘రణబలి ‘, ‘రౌడీ జనార్ధన’ వంటి సినిమాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకు ఆడియన్స్ లో డీసెంట్ రేంజ్ అంచనాలు ఉన్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper