Bigg Boss Telugu 10 : వచ్చే నెల 6 నుండి ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ రియాలిటీ షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. గత సీజన్ పెద్ద హిట్ అవ్వడం తో , ఈ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఏర్పడ్డాయి. అయితే ప్రతీ సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో షో మొదలయ్యే ముందు అనేక ఊహాగానాలు వస్తుంటాయి. పలానా కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నాడు , ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసాడు అంటూ రకరకాల వార్తలు ప్రచారం అవుతుంటాయి. అలా రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ హీరో విష్ణు పైన కూడా ప్రచారం జరిగింది. స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం ఈ సీరియల్ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది.
ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ‘బాలు’ కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అయితే ఈయన ఈ సీరియల్ నుండి తప్పుకున్నాడని , ‘బిగ్ బాస్’ మేకర్స్ ఈయనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ ఇవ్వడం తో , ఈ సీరియల్ నుండి తప్పుకొని ‘బిగ్ బాస్ 10 ‘ లోకి రాబోతున్నాడని , ఆయన స్థానం లో మరో సీరియల్ హీరో నిరంజన్ రాబోతున్నాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఈ సీరియల్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ‘బాలు’ క్యారెక్టర్ లో విష్ణు ని తప్ప మరొకరిని ఊహించుకోవడం అసాధ్యం , ఆ పాత్రకు న్యాయం చెయ్యలేరు, దయచేసి బిగ్ బాస్ కి వెళ్ళకండి , ఈ సీరియల్ లో కొనసాగండి అంటూ అభిమానులు రిక్వెస్ట్ చేశారు. ఈ సీరియల్ తో పాటు విష్ణు జెమినీ టీవీ లో ప్రసారమయ్యే ‘మా ఇంటి దేవత’ సీరియల్ లో కూడా హీరో గా నటిస్తూ వచ్చేవాడు.
ఈ సీరియల్ నుండి ఆయన తప్పుకోవడం తో , ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో తప్పుకున్నాడు అంటూ వస్తున్న వార్తలను నమ్మేశారు ఆడియన్స్. దీంతో విష్ణు స్వయంగా స్పందిస్తూ కాసేపటి క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో ని అప్లోడ్ చేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నిన్నటి నుండి సోషల్ మీడియా లో ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నుండి నేను తప్పుకున్నానని , బిగ్ బాస్ లోకి వెళ్తున్నాని వార్తలు వచ్చాయి. వాటిని నేను కూడా చూస్తూనే ఉన్నాను. ఆ పోస్టుల క్రింద వేలమంది కామెంట్స్ ని కూడా గమనించాను. సీరియల్ నుండి తప్పుకోకండి అంటూ మీరు పెట్టిన కామెంట్స్ నా హృదయాన్ని హత్తుకున్నాను. నా పై మీరు చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమకు ధన్యవాదాలు. నేను బిగ్ బాస్ షో కి వెళ్లడం లేదు , ఈ సీరియల్ లోనే కొనసాగుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.