Jr NTR: సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ల నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ఉంటాయి. వాళ్లకి ఎక్కువ మార్కెట్ ఉంటుంది ప్రేక్షకులు సైతం వాళ్ళ సినిమాలు రిపీటెడ్ గా చూడడానికి ఇష్టపడుతుంటారు. అందుకే దర్శక నిర్మాతలు వాళ్లతో ఎక్కువ సినిమాలను చేసి బిజినెస్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తున్న కూడా పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే సక్సెస్ ని మాత్రం నమోదు చేయలేకపోతున్నాడు. తన తోటి హీరోలందరు ఇప్పటికే 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుంటే ఆయన మాత్రం ఇప్పటివరకు సోలో హీరోగా చేసిన ఏ సినిమాలో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్లేదు. దాంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో 1500 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడతాననే కాన్ఫిడెంట్ తో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకులందరిలో తన కంటు ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన రాఖీ సినిమా తో విశేషమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ క్లైమాక్స్ లో చెప్పే డైలాగ్ లు ప్రేక్షకులందరిని ఆకర్షించాయి. అలాగే తన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయంటే చాలామంది ప్రేక్షకులు అలాగే విమర్శకులు సైతం ఎన్టీఆర్ మీద ప్రశంసల వర్షాన్ని కురిపించిన విషయం మనకు తెలిసిందే. అలాంటి ఎన్టీఆర్ గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ రాఖీ సినిమాలో క్లైమాక్స్ డైలాగ్ ని జస్ట్ 10 నిమిషాల్లో ఒకసారి అలా చూసుకొని సింగల్ టేక్ లో చెప్పేసారట.
ఇక అక్కడే ఉన్న సుహాసిని ఎన్టీఆర్ చెప్పిన డైలాగులకు ఆశ్చర్యపోయి తన కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వచ్చాయని కృష్ణవంశీ చెప్పిన మాటలు ఇప్పుడు సంతోషంగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ హీరోయిన్ అయిన సుహాసిని తన డైలాగులతో మెప్పించి ఆమె కళ్ళలో నుంచి ఆనందభాష్పాలు వచ్చేలా చేశాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు…