Venu Swamy: తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు వేణు స్వామి. ముఖ్యంగా సోషల్ మీడియా నెటిజెన్స్ లలో ఈయన పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరేమో. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ట్రెండింగ్ లో ఉంటాడు. ఈయన చెప్పిన వాటిల్లో కొన్ని నిజం అవ్వడం తో వాటిని ప్రోమోట్ చేసుకుంటూ తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకున్నాడు. అయితే ఈయన 2024 ఎన్నికల ఫలితాలపై చెప్పిన జాతకం ఫెయిల్ అవ్వడం తో , ఇకపై తాను బహిరంగంగా ఏ ప్రముఖుడి జాతకం చెప్పానని చెప్పుకొచ్చాడు. కానీ నాగ చైతన్య , శోభిత పెళ్లి చేసుకున్న కొత్తల్లో , వాళ్లిద్దరూ విడిపోతారని చెప్పి తీవ్రమైన విమర్శలు ఎదురుకున్నాడు. మహిళా కమీషన్ కూడా వేణు స్వామి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇక అప్పటి నుండి సైలెంట్ గా ఉంటూ వస్తున్న వేణు స్వామి , ఇప్పుడు నెమ్మదిగా జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియా లో ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వేణు స్వామి స్పందిస్తూ ‘ఎన్టీఆర్ జాతకం రీత్యా 2030 వ సంవత్సరం వరకు , ఆయన రాజకీయ అరంగేట్రం చేసే స్కోప్ కనిపించడం లేదు. అంతకు ముందు వస్తే ఆయనకు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. 2030 లో రమ్మని నేనే అతనికి చెప్పాను. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ కి అసలైన పుట్టినరోజు వేరు, బయట చేసుకునే పుట్టినరోజు వేరు.కానీ ఆయన అసలు పుట్టినరోజు కేవలం నాకు మాత్రమే తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి. రాజకీయ అరంగేట్రం గురించి మాట్లాడాడు , అక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఆయన పుట్టినరోజు విషయం లో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం, వీటిని మేము క్షమించబోము అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ రీసెంట్ గానే ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ లో గాయాలపాలై, సికింద్రాబాద్ లో భుజాలకు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కారణంగా ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ ఆగిపోయింది. మరోపక్క ప్రశాంత్ నీల్ తాను కోరుకున్న ఔట్పుట్ ఇప్పటి వరకు రాలేదని , అందుకే ఈ సినిమాని పూర్తిగా ఆపేసి , ‘సలార్ 2’ కి షిఫ్ట్ అయ్యాడని , సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ నీల్ రెస్పాన్స్ ఇస్తే తప్ప , వాస్తవ నిజం బయటకు రాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.