Dragon Movie: ‘దేవర’ , ‘వార్ 2’ వంటి చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ పై కేవలం నందమూరి అభిమానుల్లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ , ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అడుగడుగునా ప్రశాంత్ నీల్ మార్క్ కనిపించింది. తన ప్రతీ సినిమాకు ప్రశాంత్ నీల్ చేసే వరల్డ్ బిల్డింగ్ మామూలుగా ఉండదు. మానెవ్వరికి తెలియని ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి, థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం ప్రశాంత్ నీల్ స్టైల్. ఈ సినిమాకు కూడా అదే చేశాడని గ్లింప్స్ వీడియో ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది.
ఇకపోతే ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. హీరో ఆయనే , విలన్ కూడా ఆయనే. మనం చూసిన గ్లింప్స్ వీడియో విలన్ క్యారెక్టర్ కి సంబంధించినది. ‘లూగర్’ గా , ‘డ్రాగన్’ గా రెండు విభిన్నమైన పాత్రలతో ఎన్టీఆర్ తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రశాంత్ నీల్ సినిమాల కలర్ గ్రేడింగ్ బ్లాక్ షేడ్స్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ‘డ్రాగన్’ ఫ్లాష్ బ్యాక్ ని భిన్నమైన కలర్ ప్యాలెట్ లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఫుల్ కలర్ ఫుల్ గా , చాలా రిచ్ విజువల్స్ తో ఫ్లాష్ బ్యాక్ భాగాన్ని ఆయన తీర్చిదిద్దబోతున్నాడు అట. అంతే కాదు , ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక కీలక ట్విస్ట్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ సమయం లో ఎన్టీఆర్ భుజాలకు గాయాలైన సంగతి తెలిసిందే. ఆయనకు సర్జరీ కూడా చేశారు. డాక్టర్లు కనీసం రెండు నుండి మూడు నెలల సమయం కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని ఎన్టీఆర్ కి సూచించారు. అయితే ఈలోపు ఇతర నటీనటులకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ కోలుకొని సెట్స్ లోకి వచ్చిన తర్వాత మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తారట. ఎట్టి పరిస్థితి లోనూ ఈ చిత్రాన్ని జూన్ 11 న విడుదల చెయ్యాలనే టార్గెట్ లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. అదే ఏడాది డిసెంబర్ లో సీక్వెల్ ని కూడా విడుదల చేస్తారట.