Allu Arjun – Sekhar Kammula: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి నటుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా అల్లు అర్జున్ చేసిన కొన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయి, మరికొన్ని ఆశించినంత గా ఆడలేదు.ఇక అందులో భాగంగానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ షేకర్ కమ్ముల సాఫ్ట్ సినిమాలు చేస్తారు కాబట్టి అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అయిన అల్లు అరవింద్ నువ్వు తనతో సినిమా చేస్తే నీకు మాస్ ఇమేజ్ రాదనే ఉద్దేశ్యంతోనే అతనితో సినిమా చేయలేకపోయారట. నిజానికి శేఖర్ కమ్ముల ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని అల్లు అర్జున్ కోసం రెడీ చేశాడు.
కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల కి కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఆయన ఆ సెన్సిబిలిటీస్ తోనే సినిమాలను చేస్తుంటాడు. ఆ పరిధిని దాటి బయటికి రాడు, మాస్ ఇమేజ్ ని సంపాదించాలనే కోరిక అతనికి లేదు.
అందుకోసమే తను రాసుకున్న చిన్న చిన్న కథలకు కార్యరూపం ఇచ్చి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే అతని లక్ష్యం… ఇక ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ఇప్పటివరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అయితే రాలేదు. ఇకమీదట సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే అల్లు అర్జున్ పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి ఇక శేఖర్ కమ్ముల తో సినిమా చేసే అవకాశాలైతే లేవనే చెప్పాలి…