OnePlus 13s : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్లో తన వన్‌ప్లస్ 13s సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే 12GB ర్యామ్‌తో రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను తాజాగా 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో కంపెనీ తీసుకొచ్చింది. ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరును కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించారు.
వన్‌ప్లస్ 13s కొత్త వేరియంట్ ధర
భారత్‌లో వన్‌ప్లస్ 13s 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.68,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇక 12GB + 256GB వేరియంట్ ధర రూ.54,999 కాగా, 12GB + 512GB మోడల్ ధర రూ.59,999గా ఉంది. కొత్త 16GB + 512GB వేరియంట్‌ను అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్లాక్ వెల్వెట్, గ్రీన్ సిల్క్, పింక్ శాటిన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 13sలో 6.32 అంగుళాల 1.5K ఎల్‌టీపీఓ ప్రోఎక్స్‌డీఆర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1,216 × 2,640 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 1,600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 2,160Hz PWM డిమ్మింగ్, ఆక్వా టచ్ 2.0 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
పనితీరు విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఈ ఫోన్‌కు ప్రధాన బలం. 16GB వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512GB వరకు యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను వేగంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.
కెమెరా సెటప్ ఎలా ఉందంటే?
ఫోటోగ్రఫీ కోసం వన్‌ప్లస్ 13sలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను సోనీ LYT-700 సెన్సార్‌తో అందించారు. ఎఫ్/1.8 అపెర్చర్‌తో పనిచేసే ఈ కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది.
దీనికి జతగా మరో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది 2X ఆప్టికల్ జూమ్‌తో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)ను అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు.
బ్యాటరీ, కనెక్టివిటీ
వన్‌ప్లస్ 13sలో 5,850mAh బ్యాటరీని అమర్చారు. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, GPS, NavIC, NFC, యూఎస్‌బీ టైప్-సీ వంటి సదుపాయాలు ఉన్నాయి. డ్యూయల్ సిమ్‌కు కూడా ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది.
కొలతల విషయానికి వస్తే వన్‌ప్లస్ 13s పరిమాణం 150.8 × 71.7 × 8.2 మిల్లీమీటర్లు కాగా, బరువు సుమారు 185 గ్రాములుగా ఉంది. కొత్త 16GB ర్యామ్ వేరియంట్‌తో అధిక ర్యామ్, పెద్ద స్టోరేజ్ కోరుకునే వినియోగదారులకు మరో ఎంపికను వన్‌ప్లస్ అందుబాటులోకి తీసుకొచ్చింది.