Prashanth Neel: ప్రశాంత్ నీల్ గత కొంతకాలం నుండి ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూన్ 11 న ‘డ్రాగన్ పార్ట్ 1’ ని విడుదల చేసే లక్ష్యంగా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా దూసుకెళ్తున్న సమయంలో, జూనియర్ ఎన్టీఆర్ కి షూటింగ్ సమయం లో తీవ్రమైన గాయాలు అవ్వడం, దీంతో ఆయనకు డాక్టర్లు సర్జరీ చేసి , మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం తో , ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తి అయ్యాక షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి , తన ఫోకస్ ని ‘సలార్ 2’ పై షిఫ్ట్ చేయడానికి ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
ఎన్టీఆర్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ‘సలార్ 2’ షూటింగ్ ని మొదలు పెట్టడం అసాధ్యమే. ఎందుకంటే ప్రభాస్ ఖాళీగా లేడు. ఆయన చేతుల్లో ఉన్న మూడు సినిమాలు పూర్తి అయ్యాకనే ‘సలార్ 2’ షూటింగ్ గురించి ఆలోచిస్తాడు. మరి ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ పై ఎందుకు ఫోకస్ పెడుతున్నాడు అనే అనుమానాలు మీకు రావొచ్చు. అయితే ఆయన షూటింగ్ ని మొదలు పెట్టడం లేదు, కేవలం స్క్రిప్ట్ వర్క్ ని మాత్రమే మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే కొంతభాగం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. పూర్తి స్థాయి స్క్రిప్ట్ వర్క్ , డైలాగ్ వెర్షన్ తో కలిపిన స్క్రిప్ట్ ని ఇప్పుడు డెవలప్ చేయబోతున్నాడు. ఈ మూడు నెలల సమయం లో ఈ స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసి , ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్.
నిజానికి ‘సలార్’ చిత్రం కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్ గా నిల్చింది. థియేటర్స్ లో ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా , ఓటీటీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ లేకపోయినప్పటికీ కూడా ఈ చిత్రానికి 19 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక జియో హాట్ స్టార్ లోని హిందీ వెర్షన్ రెండేళ్లు ట్రెండ్ అయ్యింది. యూత్ ఆడియన్స్ కి బోర్ కొట్టినప్పుడల్లా , ఈ చిత్రాన్ని చూస్తుంటారు. వారిలో అంతటి క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న సినిమా కాబట్టే , ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి ప్రశాంత్ నీల్ కూడా అమితాసక్తిని చూపిస్తున్నాడు.