Homeఎంటర్టైన్మెంట్NTR: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య విబేధాలు వచ్చాయా..? అందుకు ప్రూఫ్ ఇదేనా!

NTR: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య విబేధాలు వచ్చాయా..? అందుకు ప్రూఫ్ ఇదేనా!

NTR: జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లను చూస్తుంటే రామ లక్ష్మణులను చూస్తున్నట్టుగానే ఉంటుందని అభిమానులు అంటుంటారు. ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటారు. ఒకరికోసం ఒకరు అండగా నిలబడుతూ ఉంటారు. అయితే అలాంటి అనోన్య అనుబంధం ఉన్న వీళ్లిద్దరి మధ్య విబేధాల ఏర్పడ్డాయా? అనే సందేహం నెటిజెన్స్ లో నెలకొంది. ఉన్నట్లుండి ఈ సందేహాలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ కొత్త నిర్మాణ సంస్థ ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండడమే. […]

NTR: జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లను చూస్తుంటే రామ లక్ష్మణులను చూస్తున్నట్టుగానే ఉంటుందని అభిమానులు అంటుంటారు. ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటారు. ఒకరికోసం ఒకరు అండగా నిలబడుతూ ఉంటారు. అయితే అలాంటి అనోన్య అనుబంధం ఉన్న వీళ్లిద్దరి మధ్య విబేధాల ఏర్పడ్డాయా? అనే సందేహం నెటిజెన్స్ లో నెలకొంది. ఉన్నట్లుండి ఈ సందేహాలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ కొత్త నిర్మాణ సంస్థ ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండడమే. రీసెంట్ గానే ఆయన ‘NTRTAIN’ పేరుతో ఒక బ్యానర్ ని ఏర్పాటు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని టాక్. అయితే కళ్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా మరో బ్యానర్ ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వెనుక ఆంతర్యం ఏంటి? అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో నడుస్తున్న చర్చ.

కళ్యాణ్ రామ్ బ్యానర్ లో ఇది వరకు జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’, ‘దేవర’ వంటి చిత్రాలు చేశాడు. రెండు కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి , ఈ సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. లాభాల షేరింగ్ విషయం లో అన్నదమ్ముల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి విబేధాలు రాలేదు. అయినప్పటికీ ఎన్టీఆర్ మరో బ్యానర్ ఎందుకు పెడుతున్నాడు?, వేరే ఏదైనా వ్యక్తిగత విషయం లో వీళ్లిద్దరి మధ్య విబేధాలు వచ్చాయా?, అందుకే ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్యానర్ ని ఏర్పాటు చేసుకున్నాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్యానర్ పెట్టుకున్నంత మాత్రానా ఇద్దరి మధ్య విదేదాలు ఉన్నాయని అనుకోవడం అవివేకం. ఒకవేళ ఎన్టీఆర్ బ్యానర్ ని ప్రకటించినా, కచ్చితంగా కళ్యాణ్ రామ్ కి కూడా అందులో కీలక పాత్ర ఉంటుంది.

అలా కాకుండా ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్యానర్ ఉండాలి , ఆ డబ్బులు తన కుటుంబానికే కావాలి అనుకోవడంలో కూడా తప్పు లేదు , ఆయన బ్యానర్, ఆయన ఇష్టం , అంతే కానీ మీకు తోచినట్టు ఊహించుకొని ఏదేదో మాట్లాడకండి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వీళ్లిద్దరు ఒకప్పటి లాగా కలిసే ఉన్నారు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని, సోషల్ మీడియా లో కొంతమంది పనిగట్టుకొని పుట్టించే పుకార్లను పట్టించుకోమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ రీసెంట్ గానే ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ సమయంలో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన భుజాలకు సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు 2 నెలల విశ్రాంతి అత్యవసరం అని చెప్పడం తో , ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ తాత్కాలికంగా నిల్చింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper