Yash: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం మరో మూడు రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజ్ లో నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో యాష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఏళ్ళ తరబడి తెలుగు ఆడియన్స్ నుండి కోట్లు సంపాదిస్తున్న కొంతమంది తమిళ హీరోలు ఇప్పటికీ తెలుగు ని నేర్చుకోలేదు. అలాంటిది యాష్ ఏకంగా 24 నిమిషాల పాటు ఏకధాటిగా తెలుగు లో అనర్గళంగా మాట్లాడడం తో , యాష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే , ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు యాష్ ఆసక్తికరమైన సమాదానాలు చెప్పాడు.
ఆయన చెప్పిన ఆ సమాధానాల బట్టీ చూస్తుంటే , ఇప్పటి వరకు యాష్ ఎన్టీఆర్ సినిమాలు చూడలేదా అనే సందేహం రాక తప్పదు. యాంకర్ సుమ యాష్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు తెలుగు బాగా ఇష్టమైన సినిమాలు ఏంటి?’ అని అడగ్గా , అందుకు ఆయన సమాధానం చెప్తూ ‘పోకిరి , కిక్, ఓజీ, మగధీర, పుష్ప, బాహుబలి చిత్రాలు అంటే నాకు బాగా ఇష్టం. అదే విధంగా గబ్బర్ సింగ్ లోని ‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ పాట ని బాగా ఎంజాయ్ చేస్తుంటాను. దేవిశ్రీ ప్రసాద్ పాటలంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమాలను నేను బాగానే చూస్తుంటాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే యాష్ దాదాపుగా అందరి స్టార్ హీరోల సినిమాల పేర్లు చెప్పాడు కానీ , జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక్క సినిమా పేరు కూడా చెప్పలేదు’.
దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అయ్యారు. 30 కి పైగా సినిమాలు తీసాడు ఎన్టీఆర్ , యాష్ ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు చూడకపోవడం వల్లనే , ఆ సినిమా పేర్లు చెప్పలేదని కొందరు, మిగతా హీరోలతో పోలిస్తే ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీ లో గొప్ప సినిమాలేవీ లేవని, అందుకే ఆయన సినిమాల పేర్లను యాష్ చెప్పలేకపోయాడని అంటున్నారు విశ్లేషకులు. మరోపక్క ఎన్టీఆర్ కర్ణాటక కింగ్ అని పిలుస్తుంటారు , అలాంటి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక హీరో ఇప్పటూ వరకు ఎన్టీఆర్ సినిమా చూడకపోవడం గమనార్హం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Aakariki Raviteja Movie Kuda cheppadu kaani NTR Movie Cheppala..
Filmography lo okka Notable Mve lekapothe Idhe Problem… pic.twitter.com/HoIW5D5jo3
— Likith… || OG2⚔️ (@likith004) August 22, 2026