Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అందరికంటే టాప్ ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న కంటెస్టెంట్ రోహిత్ నాయుడు. ‘అగ్ని పరీక్ష 2’ సమయం నుండే ఇతను ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాడు. అక్కడి నుండి ఆడియన్స్ ఓటింగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ , మొదటి రోజు నుండే తన మార్క్ ఆట ని చూపిస్తూ, ఈ సీజన్ టైటిల్ విన్నర్ తానే అనే రేంజ్ లో ఆడియన్స్ లో ఒక ముద్ర వేసేశాడు. టాస్కులు ఆడడం లో కానీ , నామినేషన్స్ సమయం లో తన వైపు నుండి సరైన పాయింట్స్ పెట్టడం లో కానీ, అవసరమైన చోట ప్రత్యర్థులపై విరుచుకుపడి ఆడడం లో కానీ , రోహిత్ ది బెస్ట్ అని అనిపించుకున్నాడు.
ఇకపోతే ఫిజికల్ టాస్కుల్లో రోహిత్ ఎంత స్ట్రాంగ్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కడే నలుగురికి సమాధానం చెప్పగలడు. నిన్నటి ఎపిసోడ్ లో ఆయన ఆట ఆడిన తీరు ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించింది. రోహిత్ గత రెండు రోజులుగా ఉపవాసం లో ఉన్నాడు. ఉపవాసం సమయం లో అన్నం నీళ్లు తీసుకోకుండా, ఎంత నీరసించి పోయి ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి సమయం లో నిలబడడమే కష్టం , అలాంటిది రోహిత్ అద్భుతంగా రామ్ ప్రసాద్ , త్రిగున్ లను ఎదురుకొని ఆడడం అనేది సాధారణమైన విషయం కాదు. టాస్క్ ఏమిటంటే బిగ్ బాస్ హౌస్ బయట నుండి కొన్ని బస్తాలను విసురుతారు. ఆ బస్తాల్లో బాల్స్ ఉంటాయి. వాటిని పట్టుకొని , ఒక లైన్ అవతల నిల్చొని , తమ ఎదురు గా ఉన్నటువంటి డిస్కులను పడగొట్టాలి. ఈ టాస్క్ చెప్పినంత తేలిక కాదని , నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రతీ ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది.
అయితే రోహిత్ తో పాటు , త్రిగున్ , రామ్ ప్రసాద్ లు కూడా అదరగొట్టేసాడు అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రోహిత్ ని తట్టుకోవడం వాళ్ళిద్దరికీ చాలా కష్టమైంది. ఇక రోహిత్ కి జోడిగా నిల్చిన దేబ్జాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. నిన్నటి ఎపిసోడ్ ఆమెదే అని చెప్పొచ్చు. ఒక అమ్మాయి అయ్యుండి , ముగ్గురు అబ్బాయిలతో తలపడి ఆడడం మామూలు విషయం కాదు. పైగా అబ్బాయిల పై ఆమె ఒక్క కంప్లైంట్ కూడా చెయ్యలేదు. ఆట అంటే ఆట గానే తీసుకొని ఆడింది. శివంగి లాగా రెచ్చిపోయింది. వీకెండ్ లో అక్కినేని నాగార్జున కచ్చితంగా ఈమెకు సెల్యూట్ చేసి , ఒక రేంజ్ లో అభినందిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే రోహిత్ కి రెడ్ కార్డు ఇస్తారా అనే అనుమానాలు ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే రోహిత్ నిన్నటి ఎపిసోడ్ లో ఒక బీస్ట్ లాగా ఆడాడు. చాలా ఓవర్ గా ఫిజికల్ అయ్యినట్టు అనిపిస్తోంది. రామ్ ప్రసాద్, త్రిగున్ లను బంతి లాగా పైకి ఎగరేసాడు, ఇద్దరికీ దెబ్బలు బాగా తగిలాయి. రోహిత్ అసలే నీరసం గా ఉండడం వల్ల , మరింత డౌన్ అయిపోయాడు. ఇక ఆడలేకపోతున్నాను అని గివ్ అప్ ఇచ్చే పరిస్థితి కి రోహిత్ రాగా , దేబ్జాని అతనికి ధైర్యం చెప్పి , మళ్లీ గేమ్ ఆడేలా చేసింది. ఫిజికల్ గా బాగా లౌ అయిపోయినప్పటికీ కూడా రోహిత్ బీస్ట్ లాగా ఆడాడు. చివరికి ఇద్దరి మధ్య కేవలం ఒక్క డిస్క్ తేడా వచ్చింది. రోహిత్ టీం ఓడిపోయింది, రామ్ ప్రసాద్ టీం గెలిచింది. కానీ ఓడిపోయినప్పటికీ కూడా రోహిత్ టీం ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంది. ఎపిసోడ్ మొత్తం బాగానే ఉంది కానీ, టెంపర్ వంశీ తో రోహిత్ గొడవ పడడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి వంశీ ఎందుకో గత రెండు రోజుల నుండి తన టెంపర్ మొత్తాన్ని కంటెస్టెంట్స్ మీద చూపిస్తున్నాడు. అవతల కంటెస్టెంట్ మామూలుగా మాట్లాడినప్పటికీ కూడా రెచ్చిపోయి రౌడీ లాగా ప్రవర్తించడం చూసి అందరూ షాక్ కి గురయ్యారు. మొదటి వారం లో మనం చూసిన వంశీ యేనా ఇతను?, ఎందుకు రెండు రోజుల నుండి ఇంత వింతగా ప్రవరిస్తున్నాడు?, ఆడియన్స్ నుండి తనకు ఓటింగ్ రావడం లేదనే కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నాడా?, లేదా గొడవ పడితే బాగా హైలైట్ అవుతాం , బోలెడంత కంటెంట్ వస్తుంది, ఓట్లు కూడా పడుతాయని అనుకున్నాడా?, నిన్న అయితే ఆయన ఆకు రౌడీ లాగానే ప్రవర్తించాడు. ఒక్క రోహిత్ తోనే కాదు , ముకేశ్ , వర్షిణి లతో కూడా అదే తరహా లో ప్రవర్తించాడు. వాళ్ళు ఈయనతో చాలా మామూలుగానే మాట్లాడుతున్నారు , కానీ ఈయన అనవసరం గా నోరు జారుతూ రెచ్చిపోతున్నాడు.
నిన్నటి ఎపిసోడ్ లో అయితే ఇతను దాదాపుగా రోహిత్ ని కొట్టేంత పని చేశాడనే చెప్పాలి. మీదకు దూసుకెళ్లడం , ఇష్టం వాచినట్టు వాడు వీడు అంటూ గౌరవం లేకుండా మాట్లాడడం , అబ్బో ఒక్కటా రెండా , కదిలిస్తే తోటి కంటెస్టెంట్స్ ని కొట్టేలా వ్యవహరిస్తున్నాడు. ఈయనకు కూడా వీకెండ్ లో నాగార్జున చేతిలో కోటింగ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ గత వీకెండ్ లో లాగా , ఈ వీకెండ్ లో కూడా కేవలం రోహిత్ కి కోటింగ్ ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం , ఈసారి ఆడియన్స్ కోపాన్ని తట్టుకోవడం కష్టం అని అంటున్నారు నెటిజెన్స్. మరి నిన్నటి టాస్క్ లో జరిగిన గొడవలో తప్పు ఎవరిదీ?, రోహిత్ దా ? , లేదా వంశీ దా ?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.