Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ షో కి కంటెంట్ కింగ్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు త్రిగున్. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి క్షణం నుండి , నేటి వరకు ఈయన ఇచ్చినంత కంటెంట్ , ఏ కంటెస్టెంట్ కూడా ఇవ్వడం లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్రిగున్ లేని బిగ్ బాస్ 10 ని అసలు ఊహించుకోవడం కష్టమే అనే రేంజ్ ఇంప్యాక్ట్ ని క్రియేట్ చేసాడు. ఇతని లో ఉన్న ఒక్కే ఒక్క మైనస్ ఏమిటంటే నోరు పారేసుకోవడం , కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టడం. అది ఆడియన్స్ కి నచ్చడం లేదు , కానీ ఇతన్ని ఎలిమినేట్ చేయడానికి ఆడియన్స్ అసలు ఆసక్తి చూపించరు. ఎందుకంటే త్రిగున్ లేకుంటే కంటెంట్ ఉండదు అనే ఉద్దేశ్యం అత్యధిక శాతం మంది ప్రేక్షకుల్లో ఉంది.
అయితే త్రిగున్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక ఆసక్తికరమైన వార్త అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అదేమిటంటే నిన్న ఆయన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేశాడట . అయితే మీరు అనుకుంటున్నట్టు ఎలిమినేట్ అయ్యి మాత్రం కాదండోయ్. నిన్న హౌస్ లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో బాగా ఫిజికల్ అయ్యారు కదా , రోహిత్ అయితే త్రిగున్ మెడమీదకు ఎక్కి దూకాడు. దీంతో త్రిగున్ కి బాగా గాయాలు అయ్యాయి అట. అందుకే ఒక గంట పాటు ఆయన్ని హౌస్ నుండి బయటి హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించారట. మళ్లీ ఆయన హౌస్ లోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అందరికంటే ముందుగా నిద్రపోయాడట. ఇప్పుడు ఆయన్ని మనం జియో హాట్ స్టార్ లైవ్ లో కూడా చూడొచ్చు. కాసేపటి క్రితమే కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన మూడవ లెవెల్ జరిగింది.
ఈ లెవెల్ లో కూడా త్రిగున్ గేమ్ చాలా అద్భుతంగా ఆడాడు. ఫిజికల్ గా బాగా దెబ్బ తిన్నప్పటికీ కూడా ఈ రేంజ్ లో గేమ్ ఆడాడంటే ఆయన పొటెన్షియల్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ వీక్ త్రిగున్ కెప్టెన్ అవుతాడా?, ఒకవేళ త్రిగున్ కెప్టెన్ అయితే హౌస్ పరిస్థితి ఏంటి ?, ఇప్పటికే రోహిత్, ముకేశ్ , వర్షిణి వంటి వారితో గొడవలు పెట్టుకున్న త్రిగున్ , కెప్టెన్ అయ్యాక ఏ రేంజ్ గొడవలు జరుగుతాయో చూడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కోరుకుంటున్నారు.