Temper Vamsi: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో మన అందరికీ మోస్ట్ వయొలెంట్ గా అనిపించిన వారిలో ఒకరు టెంపర్ వంశీ. కానీ మొదటి వారం ఆయన సాఫ్ట్ గా ఉండడం చూసి , ఈయన మరో భరణి అయ్యేలా ఉన్నాడని అంతా అనుకున్నారు. కానీ ఈ వారం ఆయన తనలోని నిజమైన టెంపర్ ని చూపిస్తూ , అందరి కంటెస్టెంట్స్ పై అరుస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే , వంశీ కి సంబంధించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. మన అందరికీ వంశీ మంచి బిజీ ఆర్టిస్ట్, ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాల్లో ఉంటాడు, కచ్చితంగా ఈయనకు రెమ్యూనరేషన్స్ బాగానే ఇస్తారు , మంచి ఆస్తులు కూడగట్టుకొని ఉంటారు అని అంతా అనుకున్నారు.
కానీ అతని ఇల్లు చూసిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఇప్పటి వరకు వంశీ ఒక సాధారణమైన ఇంట్లో తన కుటుంబం తో కలిసి అద్దెకు ఉంటున్నాడట. ఈమధ్యనే ఆయన హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడట. ఆ అద్దె ఇల్లు చూస్తుంటే చాలా చిన్నదిగా అనిపిస్తోంది. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లాగా ఉంది. ఇన్ని సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించిన ఆయన , ఏడాది క్రితం వరకు ఈ ఇంట్లో అద్దెకు ఉన్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ . అయితే ప్రస్తుతానికి వంశీ పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆయన పెద్ద ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లోనే అందుతోంది . వారానికి 2 లక్షల 50 వేల రూపాయిలను ఆయనకు ఇస్తున్నారట.
ఇప్పుడు ఆయన 10 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉంటె 25 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ వస్తుంది అన్నమాట. కానీ వంశీ ఇప్పుడు తన గేమ్ తీరుని మార్చుకోవడం తో , నాలుగు వారాలు కూడా హౌస్ లో కొనసాగడం కష్టమని అనిపిస్తోంది. అవసరమైనప్పుడు కోపం చూపించడం లో తప్పు లేదు. కానీ వంశీ అవసరం లేని చోట కూడా , తన తోటి కంటెస్టెంట్స్ తో రౌడీ లాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది ప్రేక్షకులకు అసలు నచ్చడం లేదు. ఇదే కనుక జరిగితే ఎదో ఒక వారం ఆయన నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని అంటున్నారు నెటిజెన్స్.