Jabardasth Naresh: జబర్దస్త్ కామెడీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కమెడియన్స్ లో ఒకరు పొట్టి నరేష్. ఈటీవీ లో గత 13 ఏళ్ళ నుండి ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో లో , నరేష్ విరామం లేకుండా ఎన్నో వందల స్కిట్స్ ప్రదర్శించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. చూసేందుకు చాలా చిన్నగా కనిపిస్తాడు కానీ , ఇతనిలో విషయం సముద్రమంత ఉందని అందరూ అర్థం చేసుకున్నారు. ‘జబర్దస్త్’ తో పాటు , ఈటీవీ లో అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్న నరేష్, ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇతను చూస్తే చాలా చిన్నగా కనిపిస్తున్నాడు , బిగ్ బాస్ గేమ్ కి సూట్ అవుతాడా?, అక్కడి టాస్కుల్లో సమర్థవతంగా పాల్గొనగలడా అనే సందేహాలు ప్రేక్షకుల్లో ఉండేవి.
కానీ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే తన సత్తా ఏంటో చూపించాడు నరేష్. ఇతనిలో మామూలు విషయం లేదే అని మొదటి టాస్క్ లో గెలిచి , పవర్ కీ ని సంపాదించుకున్నప్పుడే అందరికీ అర్థం అయ్యింది. ఇక ఆ తర్వాత హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కి కూడా నరేష్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. రామ్ ప్రసాద్ నుండి మంచి ఎంటర్టైన్మెంట్ ని జనాలు ఆశించారు కానీ, ఆయనకంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నరేష్ ఇస్తున్నాడు. స్పాట్ లో అప్పటికప్పుడు జోకులు వేయడం లో ఇతని టాలెంట్ అవినాష్ , ఇమ్మానుయేల్ వంటి కంటెస్టెంట్స్ తో సమానం అని అందరికీ అర్థం అయ్యింది. అసలు నరేష్ లేకపోతే ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ కష్టమే అనే తరహా లో ఆడుతున్నాడు.
అయితే నరేష్ కి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తి కరమైన విషయాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము. మొదటి వీకెండ్ ఎపిసోడ్ లో రామ్ ప్రసాద్ నరేష్ వయస్సు చెప్పే ప్రయత్నం చేయగా, నరేష్ వద్దంటూ ఎంత ప్రాధేయపడ్డాడో మనమంతా చూసాము. అందుకు ముఖ్య కారణం , ఆయన వయస్సు చాలా పెద్దది అని. దాదాపుగా 35 ఏళ్ళ వయస్సు ఉంటుందట. జెన్యూ సంబంధిత లోపం వల్ల , ఆయన ఎదగకుండా ఇలా ఉండిపోయాడు. అయితే నరేష్ కి అలా పొట్టిగా ఉండడమే ఆయన కెరీర్ కి చాలా ప్లస్ అయ్యింది. దాని వల్లే టాప్ కమెడియన్ గా ఎదిగిపోయాడు , గొప్పగా ఇండస్ట్రీ లో స్థిరపడ్డాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.