Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రామ్ ప్రసాద్ అలా మాట్లాడడం చాలా తప్పు అంటూ ఇమ్మానుయేల్...

Bigg Boss 10 Telugu: రామ్ ప్రసాద్ అలా మాట్లాడడం చాలా తప్పు అంటూ ఇమ్మానుయేల్ హాట్ కామెంట్స్!

Bigg Boss 10 Telugu: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లోనూ ఎంటర్టైనర్ క్యాటగిరీ లో జబర్దస్త్ షో నుండి ఒక కమెడియన్ ని కంటెస్టెంట్ గా తీసుకొని రావడం కొత్తేమి కాదు. ఈ సీజన్ లో జబర్దస్త్ నుండి ఆటో రామ్ ప్రసాద్, నరేష్ వంటి కమెడియన్స్ వచ్చారు. వీరి నుండి కామెడీ గత సీజన్ లో ఇమ్మానుయేల్ ని మించి ఉంటుందని ఆశించారు, కానీ ఆ రేంజ్ లో లేదనే చెప్పాలి. ఆటో రామ్ […]

Bigg Boss 10 Telugu: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లోనూ ఎంటర్టైనర్ క్యాటగిరీ లో జబర్దస్త్ షో నుండి ఒక కమెడియన్ ని కంటెస్టెంట్ గా తీసుకొని రావడం కొత్తేమి కాదు. ఈ సీజన్ లో జబర్దస్త్ నుండి ఆటో రామ్ ప్రసాద్, నరేష్ వంటి కమెడియన్స్ వచ్చారు. వీరి నుండి కామెడీ గత సీజన్ లో ఇమ్మానుయేల్ ని మించి ఉంటుందని ఆశించారు, కానీ ఆ రేంజ్ లో లేదనే చెప్పాలి. ఆటో రామ్ ప్రసాద్ కి బలం ఆటో పంచులు. అవి ఒక్కసారి ఎదుటి వ్యక్తుల మనసుల్ని నొప్పించొచ్చు. అది ఈ సీజన్ లో షాలిని విషయం లో జరిగింది. ఆమె ‘వారానికి వెయ్యి’ అంటూ సాంగ్ పాడడం , అందుకు రామ్ ప్రసాద్ ‘ఆమ్మో వెయ్యి చాలా ఎక్కువ’ అనడం, అందుకు షాలిని నొచ్చుకోవడం వంటివి జరిగాయి.

అప్పటి నుండి ఆటో రామ్ ప్రసాద్ ఆచి తూచి మాట్లాడుతున్నాడు , దీని వల్ల ఆయన నుండి సరైన కామెడీ రావడం లేదు. ఇదంతా పక్కన పెడితే ‘జబర్దస్త్’ షో లో ఆటో రామ్ ప్రసాద్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఇమ్మానుయేల్. దాదాపుగా 10 ఏళ్ళ పాటు జబర్దస్త్ షో లో ఆయనతో కలిసి ప్రయాణం చేసాడు ఇమ్మానుయేల్. అయితే నేడు ఆయన జియో హాట్ స్టార్ యాప్ లో నెటిజెన్స్ తో లైవ్ సంభాషణ జరిపాడు. ఈ సంభాషణలో నెటిజెన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆటో రామ్ ప్రసాద్ షాలిని మీద వేసిన జోక్ సరైనదే అని మీరు భావిస్తున్నారా అని ఒక నెటిజెన్ అడగ్గా, అందుకు ఇమ్మానుయేల్ ‘రామ్ ప్రసాద్ అన్నా అలా మాట్లాడడం తప్పే కదా. ఈ విషయం ఆయన కూడా ఒప్పుకున్నాడు’ అంటూ కామెంట్ చేసాడు.

అంతే కాకుండా ఈ షో లో మీ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న వాళ్ళు ఎవరు అని అడగ్గా, ప్రస్తుతానికి అయితే నన్ను మ్యాచ్ చేసే ఎంటర్టైనర్ ఈ సీజన్ లో కనిపించడం లేదు , రాబోయే రోజుల్లో చూద్దాం అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా రోహిత్ , త్రిగున్ స్నేహితులు అయితే షో బాగుండదు , వాళ్లిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటేనే గేమ్ రసవత్తరంగా ఉంటుంది అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దేబ్జాని కచ్చితంగా టాప్ 6 లో ఉంటుందని , నిన్నటి నుండి ఆమె గేమ్ ఆడడం మొదలు పెట్టింది అంటూ ఇమ్మానుయేల్ చెప్పిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper