Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి భారీ అంచనాల నడుమ అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఒకరు ఆర్జే చరణ్. ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా ఈయన ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాడు. ఆడిషన్స్ సమయం లో తప్ప , మిగిలిన టాస్కుల్లో పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ కూడా ఈయనకు ఆడియన్స్ లో క్రేజ్ ఏర్పడింది. ఆ సమయం లో ఏర్పడిన ఫాలోయింగ్ ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఆయనకు ఆ క్రేజ్ ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ బిగ్ బాస్ ఛాన్స్ ఒక్కసారి రావడమే అదృష్టం , అలాంటిది చరణ్ కి రెండవ సారి వచ్చింది. అది కూడా జనాల ఓటింగ్ ద్వారా. కాబట్టి చరణ్ ఆడియన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకొని , వాళ్ళ కోసం ప్రాణం పెట్టి గేమ్ ఆడాలి. కానీ ఆయన ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యినట్టు టాక్.
హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే , చరణ్ ని కెప్టెన్సీ కంటెండర్ గా ప్రకటిస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో కచ్చితంగా చరణ్ గెలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఈ టాస్క్ లో ఓడిపోయాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చరణ్ కి రాక రాక వచ్చిన మరో అద్భుతమైన అవకాశాన్ని కూడా వాడుకోలేకపోయాడే, ఇలా అయితే బిగ్ బాస్ షో లో మనుగడ సాగించడం కష్టం , నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఎదో ఒక వారం లో ఎలిమినేట్ అవుతాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓడిపోవడం పెద్ద సమస్య కాదు , రోహిత్ లాంటి తోపు ప్లేయర్ కూడా నిన్నటి ఫిజికల్ టాస్క్ లో ఓడిపోయాడు. కానీ అతను పెట్టిన ఎఫోర్ట్స్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి మంచి గుర్తింపు లభించింది.
ఓడి గెలిచిన రోహిత్ అంటూ సోషల్ మీడియా లో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మరి చరణ్ కూడా ఆ రేంజ్ లో టాస్క్ విషయం లో ఎఫోర్ట్స్ పెట్టాడా లేదా అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ సీజన్ మొట్టమొదటి కెప్టెన్ గా నిలిచే అవకాశాలు ఆటో రామ్ ప్రసాద్ , త్రిగున్ లలో ఎవరో ఒకరు నిలుస్తారని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.