Homeఆంధ్రప్రదేశ్‌tv9: టీవీ9 యాంకర్లు ఒక్కచోటికి వస్తే.. ఆ రచ్చ రంబోలా మామూలుగా ఉండదు.. వైరల్ వీడియో

tv9: టీవీ9 యాంకర్లు ఒక్కచోటికి వస్తే.. ఆ రచ్చ రంబోలా మామూలుగా ఉండదు.. వైరల్ వీడియో

tv9: తెలుగులో నెంబర్ వన్ న్యూస్ ఛానల్గా టీవీ9 చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. గతంలో ఎన్టీవీ ఆ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ.. ఆ తర్వాత టీవీ9 మళ్లీ ఆ స్థానంలోకి వచ్చేసింది. టీవీ9 కు బలమైన న్యూస్ నెట్వర్క్ ఉంది. తెలుగు మాత్రమే కాకుండా.. ఇతర భాషల్లో కూడా ఈ ఛానల్ రన్ అవుతుంది. మేఘా, మై హోమ్ కంపెనీల యజమానులకు ఈ ఛానల్ లో వాటా ఉంది. ఇతర భాషల్లో రన్ అవుతున్నప్పటికీ.. తెలుగులో ఈ ఛానల్ కు […]

tv9: తెలుగులో నెంబర్ వన్ న్యూస్ ఛానల్గా టీవీ9 చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. గతంలో ఎన్టీవీ ఆ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ.. ఆ తర్వాత టీవీ9 మళ్లీ ఆ స్థానంలోకి వచ్చేసింది. టీవీ9 కు బలమైన న్యూస్ నెట్వర్క్ ఉంది. తెలుగు మాత్రమే కాకుండా.. ఇతర భాషల్లో కూడా ఈ ఛానల్ రన్ అవుతుంది. మేఘా, మై హోమ్ కంపెనీల యజమానులకు ఈ ఛానల్ లో వాటా ఉంది.

ఇతర భాషల్లో రన్ అవుతున్నప్పటికీ.. తెలుగులో ఈ ఛానల్ కు తిరుగులేని స్థాయి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన మార్కెట్ ఉంది. టీవీ9 ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనంగా మారిన నేపథ్యంలో.. అప్పటినుంచి ఈ ఛానల్ ని తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందులో వచ్చిన సమాచారం ఎలాంటిదైనా సరే విశ్వసిస్తూనే ఉన్నారు. ఆరోపణలు.. విమర్శలు.. రకరకాల అభియోగాలు.. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ టీవీ9 తన బ్రాండ్ వేల్యూ కాపాడుకుంటూనే ఉంది..

టీవీ9 కి ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంతైతే వాల్యూ ఉందో.. అందులో పని చేసే యాంకర్లకు కూడా అదే వేల్యూ ఉంది. పైగా టీవీ9 లో పనిచేసే యాంకర్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతుంటారు. వాస్తవానికి ఒక న్యూస్ ఛానల్ లో పనిచేసే యాంకర్లకు సెలబ్రిటీ స్థాయి వచ్చింది అంటే దానికి కారణం ముమ్మాటికి టీవీ 9 అని చెప్పుకోవచ్చు.

టీవీ9 లో పనిచేసే యాంకర్లు ఒక్కచోటికి చేరుకుంటే ఆ సందడి మాములుగా ఉండదు. ఇటీవల నేత్ర అనే యాంకర్ ఇంటికి టీవీ9 లో పనిచేసే పృద్వి.. శిరీష.. దీప్తి.. సత్య.. ప్రణీత.. ఇంకా ఇతర యాంకర్లు వచ్చారు. సందర్భం తెలియదు గానీ.. అక్కడ డాన్సులు వేశారు. పాటలు పాడారు. ఉత్సాహంగా గడిపారు. ఆ తర్వాత సంతృప్తిగా భోజనం కూడా చేశారు. ఐటీ సెక్టర్లో ఏ స్థాయిలో అయితే పని ఒత్తిడి ఉంటుందో.. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వారి మీద కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి వార్తలు వేయాలి.. బ్రేకింగ్ న్యూస్ ఎలా చెప్పాలి.. ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి.. ఇంటర్వ్యూలు ఎలా చేయాలి? ఇలా అనేక అంశాల మీద నిత్యం కసరత్తు జరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో పని ఒత్తిడి కూడా అదే విధంగా ఉంటుంది. అందువల్లే కాస్త విరామం కోసం.. విశ్రాంతి కోసం యాంకర్లు తాపత్రయ పడుతుంటారు. అందువల్లే ఇలా ఒక్కచోటికి చేరి కాస్త మానసిక ఒత్తిడిని దూరం చేసుకున్నారు.

సినిమాలో కనిపించే వారిని డెమి గాడ్స్ అన్నట్టు.. మీడియాలో కనిపించే వారిని కూడా మన సమాజం గొప్ప వ్యక్తులుగా చిత్రీకరిస్తూ ఉంటుంది. కాకపోతే ఇలాంటి వీడియోలు చూసినప్పుడే వాళ్లు కూడా మనలాంటి మనుషులే అనిపిస్తుంది. ఏదైనా టీవీ9 యాంకర్లు గ్రేట్.. ఎందుకంటే వాళ్లు కూడా మనుషులే అని నిరూపించినందుకు.

 

View this post on Instagram

 

A post shared by Nethra (@nethra_anchor)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper