PAK vs HK : బంతి పడలేదు. ఒక్క పరుగు కూడా చేయలేదు. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టుకు బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. కలిసి రావడం మాత్రమే కాదు ఆ జట్టు ఏకంగా సెమీఫైనల్ దాకా వెళ్ళింది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం..
ఏషియన్ గేమ్స్ లో భాగంగా పురుషుల టి20 క్రికెట్లో పాకిస్తాన్ సెమీఫైనల్ దాకా వచ్చింది. వాస్తవానికి ఆ జట్టు ఇక్కడ దాకా వస్తుందని పాకిస్తాన్ అభిమానులు కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆట తీరు ఈమధ్య ఏ మాత్రం బాగోలేదు. వరుస సిరీస్లలో ఓటమి.. రెడ్.. వైట్ ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఓడిపోతుంది. దీంతో ఏషియన్ గేమ్స్ లో కూడా ఆ జట్టు మీద ఎవరికీ పాజిటివ్ ఒపీనియన్స్ లేవు. ఈ నేపథ్యంలో హాంకాంగ్ జట్టుతో జరగాల్సిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచింది.
వాస్తవానికి ఈ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దట్టంగా మేఘాలు ఏర్పడటం.. అదే పనిగా వర్షం కురవడంతో మైదానం చిన్నపాటి చెరువులాగా మారిపోయింది. అవుట్ ఫీల్డ్ ఎంతకీ ఆరకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో నిర్వాహకులు తట్టుకోలేక మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ జట్టుకు ఊరట లభించింది.
క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో ఆసియా క్రీడల నిబంధన ప్రకారం ముందుగా ర్యాంకింగ్లో ఉన్న జట్టుకు సెమీఫైనల్ అవకాశం లభిస్తుంది. పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఉన్న స్థానం ఆధారంగా తదుపరి దశకు అర్హత సాధించింది. పాకిస్తాన్ మాత్రమే కాకుండా భారత్.. బంగ్లాదేశ్.. శ్రీలంక జట్లు ర్యాంకుల ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. మరోవైపు హాంకాంగ్ గ్రూప్ బి లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ దాకా వచ్చింది.
వర్షం కురవడం.. ర్యాంకు ఆధారంగా పాకిస్తాన్ జట్టుకు సెమీఫైనల్ వెళ్లే అవకాశం రావడంతో హాంకాంగ్ జట్టుకు తీవ్రమైన నిరాశగా మారింది. పాకిస్తాన్ జట్టును ఎదుర్కొని.. మైదానంలో సత్తా చాటాలని హాంకాంగ్ జట్టు భావించింది. అయితే వర్షం కురవడం వల్ల మ్యాచ్ రద్దయింది. ర్యాంకింగ్ నిబంధనల వల్ల పాకిస్తాన్ కు సెమీఫైనల్ లోకి వెళ్లడానికి అవకాశం ఏర్పడింది.
సెమీఫైనల్ లోకి పాకిస్తాన్ వెళుతుందని ఎవరూ ఊహించలేదు. ఇటీవల కాలంలో ఆ జట్టు ఆట తీరు అంత గొప్పగా లేదు. అందువల్లే ఏషియన్ గేమ్స్ లో ఆ జట్టుపై ఎటువంటి పాజిటివ్ ఒపీనియన్ లేదు. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడం వల్ల పాకిస్తాన్ సెమి ఫైనల్లోకి వెళ్ళింది. వాస్తవానికి పాకిస్తాన్ సెమీఫైనల్ లోకి వెళ్లడాన్ని ఆ జట్టు అభిమానులు కూడా ఊహించలేకపోతున్నారు. “ఇదంతా నిజమా.. మొత్తం కలలాగా మారిపోయింది.. మా జట్టు సెమీఫైనల్ దాకా వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని” సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.