Homeఎంటర్టైన్మెంట్BRS vs Congress : ప్యారడైజ్ రిలీజ్ వేళ ఎందుకీ రాజకీయ దుమారం

BRS vs Congress : ప్యారడైజ్ రిలీజ్ వేళ ఎందుకీ రాజకీయ దుమారం

BRS vs Congress : నాని హీరోగా.. కాయదు లోహర్ హీరోయిన్ గా.. మోహన్ బాబు ప్రతి నాయకుడిగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల కంటే ముందు.. అమెరికా, ఇతర దేశాలలో ఈ సినిమా ముందుగా విడుదలైంది. ఈ సినిమా అభిమానులను అలరించిందా.. హైప్ ఇచ్చినట్టుగా ఇందులో సన్నివేశాలు ఉన్నాయా.. అనే విషయాలను పక్కన పెడితే.. ఈ సినిమాకు సంబంధించి రెండు తెలుగు […]

BRS vs Congress : నాని హీరోగా.. కాయదు లోహర్ హీరోయిన్ గా.. మోహన్ బాబు ప్రతి నాయకుడిగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల కంటే ముందు.. అమెరికా, ఇతర దేశాలలో ఈ సినిమా ముందుగా విడుదలైంది. ఈ సినిమా అభిమానులను అలరించిందా.. హైప్ ఇచ్చినట్టుగా ఇందులో సన్నివేశాలు ఉన్నాయా.. అనే విషయాలను పక్కన పెడితే.. ఈ సినిమాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగుతుంది. నాని సినిమా చుట్టూ విపరీతమైన చర్చ నడుస్తోంది.

ఈ సినిమా సెన్సార్ ప్రక్రియలో రాజకీయ ప్రస్తావనలు వచ్చాయి. వివాదాస్పద డైలాగులు కూడా ఉన్నాయని సమాచారం. దీనిపై సెన్సార్ సభ్యులు మార్పులు సూచించినట్టు సమాచారం. కొన్ని తెలుగు మీడియా కథనాల ప్రకారం సెన్సార్ బోర్డు మొత్తం 21 మార్కులు సూచించినట్టు తెలుస్తోంది.. ది ప్యారడైజ్ కథలో సామాజిక, రాజకీయ అంశాలకు చోటు ఉంది. వాస్తవానికి ఇది ప్రచారం అనుకున్నారు కానీ.. సినిమా చూసిన తర్వాత ఇది నిజమైన తేలిపోయింది. సెన్సార్ సమయంలో సమకరణ రాజకీయ నాయకుల పేర్లు.. రాజకీయ వ్యవస్థ పై వ్యాఖ్యలు.. కొన్ని డైలాగుల విషయంలో అభ్యంతర వ్యక్తం అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ డైలాగులు ఎవరిని ఉద్దేశించి చేశారు అనే దానిమీద సెన్సార్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే సినిమా చూసిన తర్వాత ఆ డైలాగులు ఎవరిని ఉద్దేశించి అన్నారు అర్థమైంది..

ఈ సినిమా విడుదలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ ప్రయాణానికి సంబంధించి హీరో నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి.. విజయ్ రాజకీయ ఎదుగుదల కేవలం స్టార్ డం లేదా సాధించిన కలెక్షన్ల వల్ల మాత్రమే కాదని.. ప్రజలతో ఆయనకు ఏర్పడిన అనుబంధమే ఓ కారణమని నాని పేర్కొన్నారు.. ఇప్పుడు ఇక ఈ సినిమాలో ప్రియదర్శి పోషించిన కెసిఆర్ లాంటి పాత్ర.. సీనియర్ ఎన్టీఆర్ పాత్ర లు రాజకీయంగా చర్చ కారణమవుతున్నాయి. కెసిఆర్ పాత్రను ఉద్దేశించి గులాబీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. థియేటర్లు తగలబడి పోతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు దీనికి తగ్గట్టుగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ సినిమాలో కెసిఆర్ పాత్రధారి పొగ తాగుతూ ఉంటాడు. దేశ్ కి నేతను చివరికి స్మోకర్ ను చేశారని కాంగ్రెస్ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పాత్రను ఒక వర్గం వారు స్వాగతిస్తుంటే.. మరో వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ది ప్యారడైజ్ సినిమా రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది… మరి దీనిపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper