Lovely Professional University: “దెయ్యం కనిపించింది. భయంకరంగా ఉంది. అది చూస్తే మాకు ఆందోళన కలిగింది. అందువల్లే రోడ్లమీదకి వచ్చాం. ఆ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టింది. ఈ విషయాన్ని చెబితే మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. అందువల్లే మేము నిరసనకు దిగాల్సి వచ్చింది” ఇవీ లవ్లీ ప్రొఫెషనల్ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆందోళన నేపథ్యంలో స్టూడెంట్స్ చెప్పిన మాటలు.
ఒక విద్యార్థిని మీద దారుణం జరిగిందని.. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడంతో.. ఆమె బలవంతంగా చనిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిని విద్యార్థులు నిజమని నమ్మారు. రోడ్లమీదకి వచ్చారు. నిరసన చేపట్టారు. కాలేజీ క్యాంపస్లో విధ్వంసం సృష్టించారు. అద్దాలు పగలగొట్టారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే.. బీభత్సకాండ ఎలా ఉంటుందో లైవ్ లో చూపించారు.
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మాత్రమే కాకుండా చిట్కా రా యూనివర్సిటీలో కూడా ఇదే స్థాయిలో గొడవ జరిగింది. విద్యార్థిని మీద దారుణం జరిగితే మేనేజ్మెంట్ పట్టించుకోలేదని.. దీంతో విద్యార్థులు కాలేజీ క్యాంపస్ లో విధ్వంసానికి పాల్పడ్డారు. రోడ్లమీదకి వచ్చి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. విద్యార్థులు మూకుమ్మడిగా బయటికి వచ్చి విధ్వంసం సృష్టించడంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. పైగా అద్దాలు పగలగొట్టడం.. పూల కుండీలను ధ్వంసం చేయడంతో పరిస్థితి భయానకంగా మారిపోయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అనుమానితుల మీద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పడంతో విద్యార్థులు శాంతించారు.
వాస్తవానికి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించడం వల్ల ఈ స్థాయిలో గొడవ జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దారుణం జరిగింది ఎవరిమీద.. దీనికి పాల్పడింది ఎవరు.. చనిపోయిన విద్యార్థిని దెయ్యంగా మారిందా.. ఆ దెయ్యాన్ని విద్యార్థులు చూశారా.. అసలు ఇలాంటి సంఘటనలకు అవకాశం ఉంటుందా.. అనే చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. జాతీయ మీడియా కూడా ఇక్కడ గొడవ మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. విద్యార్థులు దెయ్యాన్ని చూడటం వల్లే ఇదంతా జరిగిందని కొంతమంది అంటున్నారు. అయితే నేటి కాలంలో దెయ్యాలు భూతాలు లేవని విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి ఎటువంటి విషయాలను బయటకు వెల్లడిస్తారో చూడాల్సి ఉంది.
రెండు యూనివర్సిటీలలో గొడవలు జరిగిన నేపథ్యంలో పోలీసులు అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. బయట వ్యక్తులను యూనివర్సిటీ లోపలికి పంపించడం లేదు. ఈ వ్యవహారంలో అసలు వ్యక్తులు ఎవరు.. ఎందుకు ఈ స్థాయిల విధ్వంసానికి పాల్పడ్డారు అనే అంశాల మీద పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా సోషల్ మీడియాలో ఈ సందేశాలను పంపించింది ఎవరు అనే కోణంలో పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. సిసి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ స్థాయిలో విధ్వంసం జరిగిన నేపథ్యంలో రెండు యూనివర్సిటీలలో నష్టం భారీగానే చోటుచేసుకుందని.. ఇది కోట్లలో ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
View this post on Instagram