NTR: వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎంత బిజీ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఆయనకు ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ సమయం లో తీవ్రమైన గాయాలు అయ్యాయి. భుజానికి సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే విశ్రాంతి సమయం లో ఎన్టీఆర్ తన కుటుంబం తో కలిసి ఎంత సంతోషంగా ఉంటాడో అభిమానులు ఎప్పుడూ చూడలేదు. అలాంటి అభిమానులకు నేడు ఆయన ఇంట్లోని వీడియో ఒకటి వేరే లెవెల్ కిక్ ని ఇస్తోంది అని చెప్పొచ్చు. ఈ వీడియో లో ఎన్టీఆర్ తన పిల్లలు భార్గవ్ రామ్ , అభయ్ రామ్ లతో కలిసి , భగీర అనే పెంపుడు కుక్కతో ఆడుకోవడం చూసేందుకు చాలా సరదాగా అనిపించింది.
ఈ వీడియో ని చూస్తుంటే మన ఇంట్లో మన కుటుంబం తో సరదాగా గడిపే క్షణాలు గుర్తుకు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా స్టార్స్ ని దేవుళ్ళు లాగా చూస్తుంటారు అభిమానులు. అలాంటి సినిమా స్టార్స్ ఇలా వారి లాగానే సహజంగా జీవిస్తారు అనే ఫీలింగ్ ఇచ్చే కిక్ మామూలుది కాదు అనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ ని ఇంత సంతోషంగా ఉండడం చూసిన అభిమానులు చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఆయన భుజానికి రీసెంట్ గానే సర్జరీ జరిగింది. ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో , ఏంటో అని అభిమానుల్లో బెంగ ఉండేది. ఇప్పుడు ఆయన ఇంత ఆనందంగా ఉండడం చూసి మురిసిపోతున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
ఇక ‘డ్రాగన్’ మూవీ విషయానికి వస్తే వచ్చే ఏడాది జూన్ 11 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ఇది వరకే అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఈ సినిమా వాయిదాపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. పైగా ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ మధ్య క్రియేటివ్ భేదాభిప్రాయాలు చాలానే ఉన్నాయని, ఔట్పుట్ పై ప్రశాంత్ నీల్ సంతృప్తి తో లేడని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఒక రూమర్ ప్రచారం లో ఉంది. దీనికి మూవీ టీం నుండి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. మరోపక్క ఎన్టీఆర్ ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని కూడా ప్రారంభించబోతున్నాడట.