Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ స్థాయి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బుల్లితెర నుండి వెండితెర కి వచ్చి , సినిమాల్లో హీరో గా ఎంతోమంది చేశారు. కానీ ఒక్కరు కూడా సక్సెస్ కాలేకపోయారు. కనీస స్థాయి ఓపెనింగ్స్ ని కూడా అందుకోలేకపోయారు. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం మొదటి సినిమాతో కనీస స్థాయి ఓపెనింగ్స్ ని అందుకున్నాడు, అదే విధంగా ‘గాలోడు’ అనే చిత్రం తో భారీ హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈయన సరిగ్గా ఫోకస్ చేస్తే , టాలీవుడ్ లో మంచి రేంజ్ కి వెళ్తాడు , అందులో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు సైతం అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
సుధీర్ కూడా తన సత్తా ని అర్థం చేసుకొని , స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఒకపక్క ఆయన సినిమాలు చేస్తూనే , మరోపక్క వరుసగా టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. రీసెంట్ గానే జీ తెలుగు లో ఆయన ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం కి యాంకర్ గా వ్యవహరించాడు. చాలా తక్కువ రోజుల్లోనే ఈ సీజన్ ముగిసిపోయింది. మరోపక్క ఆయన ఈటీవీ లో ప్రతీ ఆదివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ స్టార్స్ 2’ ప్రోగ్రాం కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్తులో ‘సరిగమప’ షో కి కూడా ఆయన యాంకర్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇలా కెరీర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు సుడిగాలి సుధీర్. అయితే ఆయన రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం, సుధీర్ ఒక్కో ఎపిసోడ్ కి 5 నుండి 10 లక్షల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటాడట. ప్రస్తుతం మేల్ యాంకర్స్ లో అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకునేది సుధీర్ మాత్రమే. అంటే ఒక షో కి ఇప్పుడు 40 ఎపిసోడ్స్ ఉంటే 40 లక్షలు అన్నమాట. అలా కాకుండా నెలల తరబడి ఒక షో నడిస్తే మాత్రం కోట్లలో రెమ్యూనరేషన్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ , సుధీర్ కి అంత రెమ్యూనరేషన్ తీసుకునేంత క్రేజ్ , డిమాండ్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో ఆయన ‘బిగ్ బాస్’ కి నాగార్జున తీసుకునే రెమ్యూనరేషన్ ని దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు నెటిజెన్స్. ఇక సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆయన ‘హైలెస్సో’, ‘జోకర్’ వంటి చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు.