Udaya Bhanu: యాంకర్ ఉదయభానును తొక్కేసింది ఎవరు?ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి తను సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
ఉదయభాను తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళ. గలగల మాట్లాడుతూ ఉంటుంది. పైగా ఆమెలో స్పాంటేనిటి గొప్పగా ఉంటుంది. ఏ విషయమైనా సరే సూటిగా సుత్తి లేకుండా చెప్తుంది. అయితే తాజాగా యూట్యూబ్ చానల్స్ కు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా తన కెరియర్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కొంతమంది కుట్రలు పన్నారని ఉదయభాను ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
ఉదయభాను ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగులో తనకు అవకాశాలు రాకుండా ఉండడానికి కొంతమంది కుట్రలు చేశారని.. వారంతా కలిసి తన కెరియర్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టారని ఆమె వాపోయారు. లోతుల్లోకి వెళ్ళలేదు గానీ కొంతమంది వ్యక్తుల పేర్లను ఆమె ప్రస్తావించలేదు. కాకపోతే తనకు అవకాశాలు లేకుండా చేశారని ఆమె బాధపడ్డారు.
ఉదయభాను వివాహం చేసుకున్న తర్వాత.. వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. కొద్దిరోజులు బుల్లితెరకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో ఆమె గర్భం దాల్చారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. వాస్తవానికి ఆమెకు ఉన్న క్రేజ్ కు అవకాశాలు క్యూ కట్టాలి. కానీ అలా జరగలేదు. అయితే దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఇటీవల ఉదయ భాను బాంబు పేల్చారు.
ఉదయభాను చెప్పినట్టుగా ఆమె కెరియర్ మొత్తాన్ని నాశనం చేసిన వ్యక్తులు ఎవరు అని ఆరా తీస్తే.. కొంతమంది యాంకర్లు సిండికేట్ ముఠా లాగా ఏర్పడ్డారట. వాళ్లంతా కూడా ఉదయభాను కు అవకాశాలు రాకుండా చూశారట. అందువల్లే ఆమె బుల్లితెరకు దూరం కావాల్సి వచ్చిందట. అదే విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. అయితే ఉదయభాను ఈ యాంకరింగ్ వృత్తికి దూరమైనప్పటికీ.. ఆమె ఒక ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారు. త్వరలోనే ఒక సినిమాను కూడా నిర్మించబోతున్నారు. తద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ సాలిడ్ గా ఉంటుందని ప్రకటించారు.
ఉదయభాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి ఆమె చేసిన వ్యాఖ్యలను కొంతమంది ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న మహిళకు ఆపాదిస్తున్నారు. ఆమె లాబీయింగ్ చేసుకొని అవకాశాలు తెచ్చుకుంటున్నారని.. ఆమె వల్ల ఉదయభాను అవకాశాలు కోల్పోయారని కామెంట్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ కామెంట్స్ ను తప్పు పడుతున్నారు. ప్రతిభ వల్ల ఆమె అవకాశాలు తెచ్చుకున్నారని.. ఉదయభాను తొక్కాల్సిన అవసరం ఆమెకు ఏముందని వారు చెబుతున్నారు.
బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. ఇప్పుడు ఉదయభాను కూడా అంతే. తన సెకండ్ ఇన్నింగ్స్ ను సాలిడ్ గా మొదలుపెట్టడానికి ఉదయభాను సిద్ధం.. మరి ఆమెను సపోర్ట్ చేయడానికి మీరు సిద్ధమా..
View this post on Instagram