Homeలైఫ్ స్టైల్Home Buying Tips: నచ్చిన ఇల్లు.. ఇలా చేస్తే ఉచితంగానే..

Home Buying Tips: నచ్చిన ఇల్లు.. ఇలా చేస్తే ఉచితంగానే..

Home Buying Tips: ఒక మనిషికి కూడు.. గుడ్డ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఇల్లు. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో కొంతమంది మాత్రమే విజయవంతమవుతుంటారు. ముఖ్యంగా నగరాలలో ఇల్లు నిర్మించుకోవడం అంటే అంత ఈజీ పని కాదు. డబ్బున్న వాళ్ళ కంటే పెద్ద ఇబ్బంది కాదు. మధ్యతరగతి.. పేదలకు సొంత ఇల్లు నిర్మించుకోవడం అంత సులువైన విషయం కాదు. కాకపోతే మధ్యతరగతి వారు పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే బిల్లును సొంతం […]

Home Buying Tips: ఒక మనిషికి కూడు.. గుడ్డ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఇల్లు. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో కొంతమంది మాత్రమే విజయవంతమవుతుంటారు. ముఖ్యంగా నగరాలలో ఇల్లు నిర్మించుకోవడం అంటే అంత ఈజీ పని కాదు. డబ్బున్న వాళ్ళ కంటే పెద్ద ఇబ్బంది కాదు. మధ్యతరగతి.. పేదలకు సొంత ఇల్లు నిర్మించుకోవడం అంత సులువైన విషయం కాదు.

కాకపోతే మధ్యతరగతి వారు పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే బిల్లును సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ వారి దగ్గర డబ్బులు గనక ఉండి ఉంటే.. ఒక 30 లక్షల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. దానిమీద 20 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకోవాలి. ఒక 20 లక్షలతో ఇల్లు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత దానిని అద్దెకి ఇవ్వాలి. ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీ.. ఇంటి అద్దె కలిపి.. ఇంటి మీద తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐ చెల్లించవచ్చు. 10 సంవత్సరాల తర్వాత.. ఎఫ్డి మెచ్యూర్ అవుతుంది. అప్పుడు హోమ్ లోన్ తీరిపోతుంది. ఫలితంగా ఇల్లు మొత్తం మీదే అవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. అదే సమయంలో ఇంటి అద్దె కూడా పెరుగుతుంది.

వాస్తవానికి ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు చాలా స్మార్ట్ గా ఆలోచించాలి. ప్రతి పైసాను లెక్కించాలి. సాధ్యమైనంతవరకు ఆడంబరాలకు కాకుండా.. మన బడ్జెట్లో ఉండే విధంగా ఇంటిని కొనుగోలు చేయాలి. అప్పుడే ఎటువంటి ఇబ్బంది ఎదురు కాదు. ఒకవేళ స్థాయికి మించి అప్పుచేసి ఇల్లు కొనుగోలు చేస్తే.. అప్పుడు రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్లే ఇంటి నిర్మాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇటీవల కాలంలో నగరాలలో గృహాలు కొనుగోలు చేసేవారు ఇటువంటి విధానాలనే పాటిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వారు ఇంటి నిర్మాణం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పైసా పైసా కూడపెట్టి ఎఫ్ డి చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎఫ్డి మీద లోన్ తీసుకుంటున్నారు. వచ్చిన లోన్ తో ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చి.. వచ్చే డబ్బుతో.. ఎఫ్డి మీద లభించే వడ్డీతో.. మొత్తంగా ఇంటి ఈఎంఐ చెల్లిస్తున్నారు. కొంతకాలం తర్వాత అప్పు తీరిన అనంతరం సొంత ఇంట్లోకి దర్జాగా అడుగుపెడుతున్నారు. పెద్దగా కష్టపడకుండానే.. ఎటువంటి ఆర్థిక కష్టాలు పడకుండానే సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper