Jr.NTR : సుకుమార్ శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక దర్శకుడిగా చేసిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను సాధించడంతో ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అయింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ తో తప్పుకున్నాడు. కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పిన కథ అతనికి నచ్చకపోవడం వల్లే ఆయన సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు వెనకాల ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ అతనికి డేట్స్ అయితే ఇచ్చాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి సుకుమార్ ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయాలని ఎన్టీఆర్ ని కూడా ఒప్పించవచ్చు. కానీ ఎన్టీఆర్ ను ఒప్పించే ప్రయత్నం ఆయన చేయలేదని కేవలం రామ్ చరణ్ కోసం మాత్రమే ఆయన ట్రై చేశాడని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
Also Read : ‘పెద్ది’ సినిమా లో బాలయ్య బాబు నటిస్తున్నాడా..?
నిజానికి ఎన్టీఆర్ తో ఈ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ కి ఒక మాస్ హిట్ అయితే దక్కి ఉండేదేమో అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో వస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి మైండ్ అయితే పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఊర మాస్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ ను ప్రజెంట్ చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి బుచ్చిబాబు తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపుతాడా లేదంటే ఈ ఊర మాస్ సీన్లను కేవలం టీజర్ వరకే పరిమితం చేస్తాడా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడు. లేకపోతే మాత్రం మరోసారి ఆయన డీలా పడిపోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ ఈ సినిమా వెనకాల నేను ఉంటాను అని చెప్పి ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమా చేసేవాడని తను ఎన్టీయార్ తో ఏం చెప్పకపోవడం వల్లే ఈ సినిమాను ఆయన వదిలేసుకున్నాడని దీనికంతటికి కారణం సుకుమార్ గారే అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…
Also Read : జంతువులు.. రోబోలు.. అల్లు అర్జున్-అట్లీ కథ ఏంటంటే..?