Homeఎంటర్టైన్మెంట్Teja Sajja Engagement : తేజ సజ్జ సతీమణి బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు.....

Teja Sajja Engagement : తేజ సజ్జ సతీమణి బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు.. మామూలు అదృష్టం కాదు!

Teja Sajja Engagement : ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో బాలనటుడిగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, పెద్దయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ, ‘హనుమాన్’ తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారిందని అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం తర్వాత ఆయన హీరోగా నటించిన ‘మిరాయ్’ కూడా పెద్ద […]

Teja Sajja Engagement : ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో బాలనటుడిగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, పెద్దయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ, ‘హనుమాన్’ తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారిందని అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం తర్వాత ఆయన హీరోగా నటించిన ‘మిరాయ్’ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ‘జాంబీ రెడ్డి 2’ చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా నిన్న తేజ సజ్జ హైదరాబాద్ లోని తన నివాసం లో మౌర్య అనే అమ్మాయితో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో గ్రాండ్ గా నిశ్చితార్థ వేడుక జరుపుకున్నాడు.

ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిధిగా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని,రానా దగ్గుబాటి, శ్రీకాంత్, ప్రశాంత్ వర్మ వంటి వారితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక తేజ సజ్జ కాబోయే సతీమణి మౌర్య విషయానికి వస్తే, ఈమె విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థల యజమాని కూతురు. ఈమెకి వేల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్టు ఇది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిరించిన వివాహమే. చూసేందుకు ఎంతో ముచ్చటగా కనిపిస్తున్న ఈv జంట కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

రీసెంట్ గానే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుక ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వేడుక జరిగిన కొద్దిరోజులకే తేజ సజ్జ నిశ్చితార్థం జరగడం విశేషం. సాయి ధరమ్ తేజ్ పెళ్లి డిసెంబర్ నెలలో జరగనుండగా, తేజ సజ్జ పెళ్లి కూడా అదే నెలలో జరగనుంది. ఇక తేజ సినీ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ఇమేజ్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. తేజ సజ్జ సినిమా వస్తుందంటే కచ్చితంగా భారీ స్థాయిలో ఉంటుంది అనే అంచనాలు ఆడియన్స్ లో ఏర్పడుతున్నాయి. రీసెంట్ గానే ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియో లో ‘ది ట్రైటర్స్’ అనే సూపర్ హిట్ రియాలిటీ షోకి వ్యాఖ్యతగా కూడా వ్యవహరించి, ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక పెళ్లి తర్వాత ఆయన రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper