Allu Arjun-Atlee : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. మన స్టార్ డైరెక్టర్లందరూ వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు…ఇక తెలుగు హీరోలైతే వాళ్ళు చేసిన ప్రతి సినిమాతో పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి నటుడు సైతం పాన్ ఇండియాను షేక్ చేసే సినిమా చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఇప్పుడు ఆయన డైరెక్టర్ అట్లీ తో ఒక గొప్ప సినిమా తీయాలని చూస్తున్నాడు. ఇక సన్ పిక్చర్స్ వాళ్లు ఎక్స్ లో రిలీజ్ చేసిన ఒక వీడియో ను బట్టి చూస్తే వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది… ఒక వ్యక్తి సూపర్ మ్యాన్ గా మారి తను కొన్ని రోబో లను తయారు చేస్తాడట. ఇక వాటితో పాటుగా కొన్ని జంతువుల్ని కూడా క్రియేట్ చేసి ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్న కొన్ని దుష్ట శక్తుల నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా స్టోరీ గా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను హైలీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : పరీక్ష తప్పిన విద్యార్థులు..తప్పు ఎవరిది.. పవన్ సంచలన నిర్ణ యం
మొత్తానికైతే ఈ సినిమాతో అటు అట్లీ (Atlee), ఇటు అల్లు అర్జున్(Allu Arjun) ఇద్దరు భారీ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా రికార్డ్ లను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
మరి వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ను అనుకున్నట్టుగా తీస్తే మాత్రం ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది. లేకపోతే మాత్రం భారీగా ఇబ్బంది పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాకోసం దాదాపు 700 కోట్ల బడ్జెట్ ను కెటాయించినట్టుగా తెలుస్తోంది…ఇక ఇలాంటి సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారి గా తన రేంజ్ ను మార్చి టాప్ లేవల్లోకి దూసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక వరుసగా అలా వైకుంఠపురం లో, పుష్ప , పుష్ప 2 సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో కూడా భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తోంది. తద్వారా అల్లు అర్జున్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది…
Also Read : రాజమౌళి మహేష్ సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాడా..?