Homeఎంటర్టైన్మెంట్Tarun Bhascker: ఈషా రెబ్బ లేకపోతే ఏమైపోయేవాడో.. సంచలన నిజం బయటపెట్టిన తరుణ్ భాస్కర్ తల్లి..

Tarun Bhascker: ఈషా రెబ్బ లేకపోతే ఏమైపోయేవాడో.. సంచలన నిజం బయటపెట్టిన తరుణ్ భాస్కర్ తల్లి..

Tarun Bhascker: తరుణ్ భాస్కర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన దర్శకుడు. ఈ నగరానికి ఏమైంది.. పెళ్లిచూపులు.. వంటి చిత్రాలతో ఇతడు తన రేంజ్ ఏమిటో తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. సున్నితమైన స్టోరీ.. దానికి తగ్గట్టుగా కామెడీ సన్నివేశాలు.. హ్యూమర్ జోడించడంలో ఇతడు సిద్ధహస్తుడు. పైగా ఈ కాలపు ప్రేక్షకులకు ఏం కావాలో ఇతడికి బాగా తెలుసు. అందువల్లే అతడి సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇతడి కెరియర్లో పెళ్లిచూపులు సూపర్ హిట్. ఈ నగరానికి […]

Tarun Bhascker: తరుణ్ భాస్కర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన దర్శకుడు. ఈ నగరానికి ఏమైంది.. పెళ్లిచూపులు.. వంటి చిత్రాలతో ఇతడు తన రేంజ్ ఏమిటో తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. సున్నితమైన స్టోరీ.. దానికి తగ్గట్టుగా కామెడీ సన్నివేశాలు.. హ్యూమర్ జోడించడంలో ఇతడు సిద్ధహస్తుడు. పైగా ఈ కాలపు ప్రేక్షకులకు ఏం కావాలో ఇతడికి బాగా తెలుసు. అందువల్లే అతడి సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇతడి కెరియర్లో పెళ్లిచూపులు సూపర్ హిట్. ఈ నగరానికి ఏమైంది అనే సినిమా కూడా భారీగానే వసూలు సాధించింది.

ఆ తర్వాత మెగా ఫోన్ పక్కన పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తరుణ్ భాస్కర్ కొనసాగుతున్నారు. మీకు మాత్రమే చెప్తా.. కీడా కోలా వంటి సినిమాలు తరుణ్ భాస్కర్ లో మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాయి. దర్శకుడిగా.. నటుడిగా తరుణ్ భాస్కర్ మంచి స్థానంలో ఉన్నాడు. అయితే ఇతడి వ్యక్తిగత జీవితం మాత్రం అనేక ఒడిదుడుకులకు గురైంది. ఇతడి వివాహం విచ్ఛిన్నమైనది. ఆవిడాకుల కేసు.. ఇతర వ్యవహారాల వల్ల ఇతడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇతని జీవితంలోకి ఈశా ప్రవేశించింది. అనంతరం ఇతడి జీవితం పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం విడాకుల కేసు పరిష్కారమైందని అంటున్నారు. ఈషాతో ఇతడు త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడని తెలుస్తోంది. ఈ నగరానికి ఏమైంది 2 సినిమా గురువారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈశా.. తరుణ్ భాస్కర్ కలసి పాల్గొన్నారు. ఇద్దరు ప్రివ్యూ షో కూడా చూశారు. ఈ సినిమాకు సంబంధించి జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లలో తరుణ్ భాస్కర్ మాతృమూర్తి పాల్గొన్నారు. తరుణ్ భాస్కర్.. ఈషా లవ్ స్టోరీ ని బయటపెట్టారు. తరుణ్ భాస్కర్ కోర్టు కేసులు.. ఇంకా అనేక రకాల ఒత్తిడిలను ఎదుర్కొన్నారని.. ఇప్పుడు అతడికి ఈషా ఉందని.. ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

గతంలో అతడు కేసులు ఎదుర్కొంటున్నప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడేవాడని.. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొనే వాడని.. ఇలాంటి సమయంలో అతడికి ఈషా తోడుగా నిలిచిందని తరుణ్ భాస్కర్ మాతృమూర్తి చెప్పుకొచ్చారు. ఈషా.. తరుణ్ భాస్కర్ మధ్య ఉన్న లవ్ స్టోరీ ని కూడా ఆమె వివరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. అలాగే ఈ నగరానికి ఏమైంది 2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన సొంతం చేసుకుంది. త్వరలోనే ఈశా.. తరుణ్ భాస్కర్ వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by MediaFx App (@mediafxapp)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper