Pawan Kalyan Divorce : పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు తీసుకున్న ఘటన గురించి యావత్తు తెలుగు ప్రజలు ఏ స్థాయిలో చర్చించుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. అభిమానులు అయితే ఇప్పటికీ ఆ బాధ నుండి తేరుకోలేదు. ఎంతో అన్యో్యమైన ఈ జంట ఇలా విడిపోదానికి గల కారణం ఎవరికీ తెలియదు కానీ, సోషల్ మీడియా లో మాత్రం రకరకాల ఊహాగాణాలతో కథనాలను ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అయితే ఓజీ సినిమా సక్సెస్ కారణంగానే వీళ్లిద్దరు విడిపోయి ఉండొచ్చని అంటున్నారు. ఓజీ సక్సెస్ కి దీనికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ టాలీవుడ్ లో కొన్ని సెంటిమెంట్స్ ని అభిమానులు చాలా బలంగా నమ్ముతుంటారు. అందులో ఇది కూడా ఒక్కటి.
అభిమానులు నమ్ముతున్న సెంటిమెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడైనా భారీ ఇండస్ట్రీ హిట్ తగిలితే ఆయన వ్యక్తిగత జీవితం డిస్టర్బ్ అయిన సందర్భాలు ఉన్నాయని, గతం లో ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యాక, కొద్దీ నెలల వ్యవది లోనే పవన్ కళ్యాణ్ తన సతీమణి రేణు దేశాయ్ తో విడిపోయాడని, ఇప్పుడు ఓజీ చిత్రం పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలవడమే కాకుండా టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిల్చిందని, ఈ సినిమా విడుదలైన ఏడాదికి పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినోవా తో విడిపోయాడని అంటున్నారు. సినిమాల్లో భారీ సక్సెస్ కొట్టిన ప్రతీసారీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం లో సంక్షోభం జరుగుతుందని, ఇదెక్కడి కర్మరా దేవుడా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా 2023 వ సంవత్సరం నుండే మెంటల్ గా విడిపోయారని, అప్పటి నుండి భార్యభర్తలుగా కాకుండా స్నేహితులుగా ఉంటూ వస్తున్నారని, ఇప్పుడు లీగల్ గా విడిపోయారని అంటున్నారు. కానీ ఒకప్పుడు ఎలా అయితే స్నేహం గా ఉండేవారో, ఇప్పుడు కూడా అదే తరహా లో ఉంటారని, వచ్చే నెలలో జరగబోయే సాయి ధరమ్ తేజ్ పెళ్లి కి కూడా అన్నా లెజినోవా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నెటిజెన్స్. ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ ని విమర్శించిన ప్రతీ ఒక్కరి నోటి నుండి మాట కూడా రాదని అంటున్నారు ఫ్యాన్స్. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.