Peddi : బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘పెద్ది’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది. మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగింది. ముఖ్యంగా మెగా అభిమానులైతే ఈ సినిమా చూసి ఆనంద పడుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గల్లీ క్రికెట్ ఆడే ఒక ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. మరి ఈ క్రమంలోనే ఇది ఒక మాస్ జాతరగా తెరకెక్కబోతున్న సినిమా అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఈ సినిమాలో మొదట రామ్ చరణ్ కి క్రికెట్ మీద అంత అవగాహనైతే ఉండదట. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన క్రికెట్ ఆడాల్సిన అవసరమైతే వస్తుంది. దానివల్ల ఆయనకి క్రికెట్ నేర్పించడానికి ఒక కోచ్ కూడా ఉంటాడట.
Also Read : బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ‘పెద్ది’..కళ్ళుచెదిరే బిజినెస్ ఆఫర్స్!
ఆయన ఎవరు అంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగులో టాప్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబుని ఆ క్యారెక్టర్ లో నటింపజేయాలనే ఉద్దేశ్యంలో దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళు అనుకుంటున్నట్టుగానే బాలయ్య ఈ సినిమాలో కనక నటించినట్లైతే మాత్రం సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతాయి. అయితే ఇప్పటికే సుకుమార్, బుచ్చిబాబు, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి బాలయ్య బాబును కలిసి కథ చెప్పినట్టుగా తెలుస్తోంది.
మరి బాలయ్య బాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో బాలయ్య బాబు నటిస్తాడా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ బాలయ్య కనక ఈ సినిమాలో నటిస్తే రామ్ చరణ్ కి బాలయ్య కి మధ్య మంచిర్యాపో ఉంది కాబట్టి సినిమాలో కూడా ఇది బాగా ఎలివేట్ అవుతుంది.
తద్వారా బాలయ్య బాబు కోచ్ గా రామ్ చరణ్ ను ట్రైన్ చేసిన విధానం కూడా సినిమాలో చాలా హైలైట్ గా చూపిస్తారు. కాబట్టి ఈ సినిమా బాలయ్య బాబుకి కూడా చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : ‘పెద్ది’ మూవీ పూర్తి స్టోరీ ఇదే..సరిగ్గా తీస్తే ‘దంగల్’ ని మించిన సినిమా అవుద్ది!