Homeఆంధ్రప్రదేశ్‌Bandla Ganesh: బండ్ల గణేష్ కు భారీ షాక్.. ఏడాది జైలు.. 95 లక్షల జరిమానా

Bandla Ganesh: బండ్ల గణేష్ కు భారీ షాక్.. ఏడాది జైలు.. 95 లక్షల జరిమానా

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత.. వ్యాపారవేత్త.. నటుడు బండ్ల గణేష్ కు న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ఆయనకు ఏడాది జైలు శిక్షతోపాటు.. 95 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో సినిమా నిర్మాణ అవసరంల నిమిత్తం బండ్ల గణేష్ ఒక ప్రైవేటు ఫైనాన్షియర్ వద్ద భారీ మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. బాకీ తీర్చే సమయంలో ఆయన ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అయ్యాయి. దీంతో ఆ వ్యక్తి […]

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత.. వ్యాపారవేత్త.. నటుడు బండ్ల గణేష్ కు న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ఆయనకు ఏడాది జైలు శిక్షతోపాటు.. 95 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో సినిమా నిర్మాణ అవసరంల నిమిత్తం బండ్ల గణేష్ ఒక ప్రైవేటు ఫైనాన్షియర్ వద్ద భారీ మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. బాకీ తీర్చే సమయంలో ఆయన ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అయ్యాయి. దీంతో ఆ వ్యక్తి గణేష్ మీద కోర్టులో చెక్ బౌన్స్ (నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్) కేసు దాఖలు చేశారు. ఈ కేస్ మీద సుదీర్ఘంగా న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం గణేష్ ను దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో ఏడాదిపాటు జైలు శిక్ష.. అలాగే 95 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. జరిమానా చెల్లించని క్రమంలో అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు మీద హైకోర్టులో అప్పీల్ చేయడానికి గణేష్ కు కోర్టు అవకాశం కల్పించింది. దీంతో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి.. ఈ తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో గణేష్ మీద అనేక రకాల కేసులు నమోదయ్యాయి. ఆయన కోర్టుల చుట్టూ తిరిగారు. తాజా తీర్పుతో టాలీవుడ్ వర్గాలలో ఈ విషయం చర్చకు దారి తీసింది. ఇటీవల తన ఆస్తి వేలానికి సంబంధించి గణేష్ ఓ బ్యాంకు తీరు పట్ల తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కేసు కూడా దాఖలు చేశారు.

ఇటీవల గణేష్ తన కూతురు జనని వివాహాన్ని అత్యంత ఘనంగా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మంత్రులు.. సినీ నటులు.. ఇంకా చాలామంది ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. బండ్ల గణేష్ నిత్యం వార్తలోనే ఉంటారు. ఈయన టిడిపి అధినేత చంద్రబాబుకు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ ను సైతం అమితంగా ప్రేమిస్తుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అనే సినిమాను నిర్మించారు. బాద్ షా.. టెంపర్ .. ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలకు ఈయన నిర్మాతగా వ్యవహరించారు. సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించారు. బండ్ల గణేష్ కు పౌల్ట్రీ వ్యాపారాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కోళ్లను.. గుడ్లను ఎగుమతి చేసే ప్రధాన వ్యాపారవేత్తల్లో ఈయన ఒకరు.

బండ్ల గణేష్ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో.. ఆయన పాదయాత్ర చేశారు. తిరుమలకు నడిచి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుని కలిశారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందజేశారు. ఇక ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తల సేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు. అప్పుడు కూడా బండ్ల గణేష్ ఆ కార్యక్రమానికి హాజరై.. నారా భువనేశ్వరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper