Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో సరికొత్త చాప్టర్ మొదలైంది. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు తో కలిసి ఆమె మాతృత్వపు మధురానుభూతిని ఆస్వాదిస్తున్నది. ఈ దంపతులకు నవంబర్ 19న మగ బిడ్డ జన్మించారు. నవంబర్ 20న ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సమంత వెల్లడించారు. తమ కుమారుడి పేరును కూడా అభిమానులతో పంచుకున్నారు. చిన్నారికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టినట్టు ప్రకటించారు సమంత. దీంతో ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నీయాంశంగా మారింది.
ఆ పేరుకు అర్థమేంటి
సమంత తన కుమారుడికి పెట్టిన దేవ్ అనే పేరుకు సంస్కృత మూలాలు ఉన్నాయి. దేవ్ అంటే దేవుడు.. దైవత్వం కలిగినవాడు అని అర్ధాలు వస్తాయి. పవిత్రత.. దైవిక స్వభావానికి కూడా ఈ పేరు ప్రతీకగా భావిస్తారు. చిన్నగా.. సులభంగా పలకడానికి వీలుగా ఉండడంతో పాటు చక్కటి అర్థం ఉండడం ఈ పేరులో ఉన్న ప్రత్యేకత..
ఈ పేరులో మరో ఆసక్తికరమైన అంశం నిడిమోరు అనే ఇంటి పేరు.. సమంత తన కుమారుడికి తండ్రి రాజ్ నిడిమోరు ఇంటి పేరు ఉన్న జోడించింది. దీంతో చిన్నారి పూర్తి పేరు దేవ్ నిడిమోరు గా మారింది. సాధారణంగా కుటుంబ ఇంటిపేరును తర్వాతి తరానికి కొనసాగించే సంప్రదాయం మనదేశంలో ఉంది. ఈ నేపథ్యంలో తండ్రి ఇంటి పేరుతో కుమారుడికి నామకరణం చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే దేవ్ అనే పేరును ఎంచుకోవడానికి గల కారణాన్ని ఈ జంట బయటకు చెప్పలేదు.
సమంత.. రాజ్ పరిచయం మీ ఫ్యామిలీ మెన్ సిరి సమయంలో ఏర్పడింది. ఆ తర్వాత సిట్ ఆర్ డెల్ హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల్లోను కలిసి పని చేశారు. కొంతకాలం తమ వ్యక్తిత్వ జీవితాన్ని గోప్యంగా ఈ జంట ఉంచింది. 2025 డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్లో లింగ బైరవి ఆలయం వద్ద భూత శుద్ధి సంప్రదాయంలో ఈ జంట ఒక్కటైంది. ఈ ఏడాది జూన్లో సమంత తన గర్భధారణ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా కుమారుడి రాకతో తమ కుటుంబంలో కొత్త ఆనందాన్ని ఆహ్వానించింది. తమ చిన్నారి పేరును ప్రకటిస్తూ మా హృదయాలు ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నాయి అంటూ సమంత.. రాజు భావోద్వేగమైన సందేశాన్ని బయటపెట్టారు. రాజ్ ను వివాహం చేసుకున్న తర్వాత సమంత త్రలాలా అనే పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. శుభం.. మా ఇంటి బంగారం అనే విజయవంతమైన సినిమాలను నిర్మించారు. మా ఇంటి బంగారం సినిమా ఏకంగా 100 కోట్లను వసూలు చేసింది.
View this post on Instagram