Jani Master: రీసెంట్ గా డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ఏర్పడిన గొడవలు సినీ ఇండస్ట్రీ లో ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్యాన్సర్స్ కి కొరియోగ్రాఫర్స్ సరిగా డబ్బులు ఇవ్వడం లేదని, నిర్మాతల దగ్గర తీసుకునే డబ్బులు ఒకటైతే, డ్యాన్సర్స్ కి ఇచ్చే డబ్బు మరొకటని, కష్టాన్ని దోచుకుంటున్నారని, అసలు ఫెడరేషన్ నే రద్దు చేయాలనీ జానీ మాస్టర్ గొడవ చేయడం, అందుకు శేఖర్ మాస్టర్ ఒప్పుకోకపోవడం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి కానీ, అందుకోసం ఫెడరేషన్ ని మూసేయమనడం ఏంటి అని వాదించడం, ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అవ్వడంతో, నేరుగా మెగాస్టార్ చిరంజీవి రంగం లోకి దిగిన తర్వాత సమస్య సర్దుకోవడం వంటి సంఘటనలు జరిగాయి.
అయితే జానీ మాస్టర్ ఫెడరేషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని , 24 గంటల్లో అందుకు వివరణ ఇవ్వకపోతే అతన్ని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తామంటూ మండిపడింది. ఆ తర్వాత జానీ మాస్టర్ ఫెడరేషన్ కి వివరణ ఇవ్వడం, ఫెడరేషన్ ఆయనపై బ్యాన్ ఎత్తివేయడం వంటివి కూడా జరిగాయి. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, ఇండస్ట్రీ లో ఉన్న సమస్యల గురించి మాత్రమే మా పోరాటం అంటూ చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్. అంతా సర్దుకుంది అనుకుంటున్న సమయంలో, ఇప్పుడు జానీ మాస్టర్ సతీమణి సుమలత ని డ్యాన్సర్స్ అసోసియేషన్ చైర్మన్ పదవి నుండి తప్పించడం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.
ఆమెకు ఇంకా ఏడాదిన్నర పదవీకాలం ఉంది. అయినప్పటికీ చైర్మన్ పదవి నుండి తప్పించారు. ఇప్పుడు కొత్తగా డ్యాన్సర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ ఎంపిక అవ్వగా, మెహర్ బాబా మాస్టర్ సెక్రటరీ గా, బసవరాజు వైస్ ప్రెసిడెంట్ గా, రాజన్న జాయింట్ సెక్రటరీ గా ఎంపికయ్యారు. అయితే వీళ్లంతా తాత్కాలిక సభ్యులు మాత్రమేనట. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తారట. ఇదంతా పక్కన పెడితే కొత్తగా ఎంపికైన రఘు మాస్టర్, శేఖర్ మాస్టర్ కి అత్యంత సన్నిహితుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అంటే శేఖర్ మాస్టర్ ఏది చెప్తే, అదే డ్యాన్సర్స్ అసోసియేషన్ లో నడుస్తుందా?, నేషనల్ అవార్డు ని గెలుచుకునే స్థాయికి ఎదిగిన జానీ మాస్టర్ కి అసోసియేషన్ పై గ్రిప్ తగ్గిందా అని చర్చించుకుంటున్నారు నెటిజెన్స్.