Homeఎంటర్టైన్మెంట్The Paradise Movie: 'ది ప్యారడైజ్' ప్రీ రిలీజ్ కి ఊహించని అతిథి..ఫ్యాన్స్ కి విజువల్...

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ కి ఊహించని అతిథి..ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్!

The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియా నే కనిపిస్తోంది. సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజుల సమయం ఉండడం తో మేకర్స్ ప్రొమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇప్పటికే హీరో నాని నాన్ స్టాప్ గా ఇంటర్వూస్ […]

The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియా నే కనిపిస్తోంది. సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజుల సమయం ఉండడం తో మేకర్స్ ప్రొమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇప్పటికే హీరో నాని నాన్ స్టాప్ గా ఇంటర్వూస్ మీద ఇంటర్వూస్ ఇస్తూనే ఉన్నాడు. మరో పక్క మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. టాలీవుడ్ హిస్టరీ లోనే ఎప్పటికీ గుర్తించుకునే రేంజ్ ఈ ఈవెంట్ ని రెడీ చేస్తున్నారట. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లేదా గచ్చిబౌలి స్టేడియం లో ఈ ఈవెంట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నాడట. చిరంజీవి , నాని కి మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘ది ప్యారడైజ్’ తర్వాత చిరంజీవి ని హీరో గా పెట్టి , నిర్మాతగా ఒక సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడు నాని. 2024 వ సంవత్సరం లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ఈ చిత్రానికి కూడా శ్రీకాంత్ ఓదెల నే దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే శ్రీకాంత్ ఓదెల పని తీరు చాలా నెమ్మదిగా ఉందని , దాని వల్ల బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయ్యిందని, నాని శ్రీకాంత్ పని తీరు పట్ల సంతృప్తి గా లేకపోవడం తో , చిరంజీవి తో కమిట్ అయిన ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసాడని , ఇలా సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు ప్రచారం అయ్యాయి.

అయితే వీటిల్లో ఎలాంటి నిజం లేదని , ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఖరారు కానుంది. ఇదే ఈవెంట్ లో చిరంజీవి -శ్రీకాంత్ ఓదెల మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన జరగనుంది. ప్రస్తుతం ‘కాకా’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న చిరంజీవి , ఈ సినిమా పూర్తి అయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించబోతున్న ఈ సినిమా పై రాబోయే రోజుల్లో ఎలాంటి అంచనాలు ఏర్పడబోతున్నాయి చూడాలి. ఒకవేళ ప్యారడైజ్ చిత్రం ఫ్లాప్ అయితే , ఈ సినిమా క్యాన్సిల్ అవుతుందా? అనేది కూడా చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper