Homeబిజినెస్Millionaire Tips : ఉద్యోగం చేసుకుంటూనే కోటీశ్వరులు అయ్యే బెస్ట్ టిప్స్ ఇవే..

Millionaire Tips : ఉద్యోగం చేసుకుంటూనే కోటీశ్వరులు అయ్యే బెస్ట్ టిప్స్ ఇవే..

Millionaire Tips : డబ్బు సంపాదన రెండు మార్గాల్లో ఉంటుంది. ఒకటి ఉద్యోగం ద్వారా.. మరొకటి వ్యాపారం ద్వారా. అయితే ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సొంతంగా వ్యాపారం చేస్తే కోటీశ్వరులు కూడా కావచ్చు అని భావిస్తారు. కానీ కొన్ని ప్రణాళికల ప్రకారం వెళ్తే ఉద్యోగం చేసే వారు కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ […]

Millionaire Tips : డబ్బు సంపాదన రెండు మార్గాల్లో ఉంటుంది. ఒకటి ఉద్యోగం ద్వారా.. మరొకటి వ్యాపారం ద్వారా. అయితే ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సొంతంగా వ్యాపారం చేస్తే కోటీశ్వరులు కూడా కావచ్చు అని భావిస్తారు. కానీ కొన్ని ప్రణాళికల ప్రకారం వెళ్తే ఉద్యోగం చేసే వారు కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతులు చూద్దాం..

ఉద్యోగం అనగానే కష్టపడాలి అనే భావన ఉంటుంది. వాస్తవానికి కష్టపడకుండా ఏదీ రాదు.. కానీ ఎప్పటికీ కష్టాన్ని మాత్రమే కాకుండా మెదడుకు కూడా పని చెబుతూ ఉండాలి. అంటే ఒక వైపు పనులు చేస్తూనే.. మరోవైపు వచ్చిన డబ్బును రెట్టింపు చేసే ఆలోచనలు చేయాలి. ఇందులో భాగంగా కొన్ని ప్రణాళికలు వేసుకోవాలి. అలా చేస్తే ఉద్యోగులు కూడా కోటేశ్వరులు కావడం పెద్ద విషయం కాదని అర్థమవుతుంది. వీటిలో ఇవి పాటించాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.

కొంతమంది జీతం రాగానే అన్ని ఖర్చులు పోను మిగిలిన దానిని సేవ్ చేస్తారు. కానీ అలా కాకుండా అత్యవసర వాటికి కేటాయించి.. ఆ తర్వాత ఒక నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేసి.. మిగిలిన మొత్తంలోనే ఖర్చులు చేయాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల వరకు డబ్బు పెరిగినట్లు తృప్తి అవుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద మొత్తం తయారైన తర్వాత ఇన్వెస్ట్మెంట్కు ప్లాన్ చేయాలి.

ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకునేవారు ఒకే దాంట్లో పెట్టుబడులు పెట్టకుండా.. వివిధ మార్గాలను ఎంచుకోవాలి. అందులో మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్స్ ఇలా ఉన్న మొత్తంలో విభజించాలి. అలా కాకుండా ఒకే దాంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిల్లోనూ రిస్క్ లేకుండా ఉండే వాటిని ఎంచుకోవడం మంచిది.

చిన్న మొత్తాల్లో అయినా సరే ఎక్కువకాలం క్రమ పద్ధతిలో పెట్టుకుంటూ పోతే వాటి రాబడి ఊహించని దానికంటే ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటి ద్వారా నష్టం కూడా ఉండదు. వీటితోపాటు అప్పులను వెంటనే తీర్చడం వల్ల శారీరక, మానసిక శ్రమ తగ్గుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ పని చేయగలుగుతారు. అందువల్ల అప్పులు లేకుండా చూసుకోవాలి.

ఉద్యోగం ప్రధాన ఆదాయం వనరు అయినప్పటికీ అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తుండాలి. నైపుణ్యాలను కొన్ని కంపెనీల్లో ప్రదర్శిస్తే సంపద కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇలా అదనంగా ఆదాయం వస్తే వాటిని కొత్త పెట్టుబడుల వైపు మళ్ళించాలి. ఈ విధంగా కొన్ని రోజుల తర్వాత కోటీశ్వరులు కావడానికి పెద్ద కష్టం అనిపించదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper