Dhee 21 Show: తెలుగు బుల్లితెర హిస్టరీ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ షోస్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ‘ఢీ’ షో ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకటి కాదు , రెండు కాదు , ఏకంగా 20 సీజన్స్ ని పూర్తి చేసుకొని , త్వరలో 21 వ సీజన్ ని ప్రారంభించుకోనుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ నెల 18 నుండి ఈటీవీ తో పాటు , ఈటీవీ విన్ , నెట్ ఫ్లిక్స్ యాప్స్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గానే ఈ సరికొత్త సీజన్ కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేశారు. ఈ ప్రోమో లో అనుపమ పరమేశ్వరన్, జానీ మాస్టర్ వంటి వారు జడ్జీలుగా వ్యవహరించబోతున్నట్టు చూపించారు.
అదే విధంగా హోస్ట్ గా ప్రదీప్ ఉంటాడని కూడా చూపించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ అసలైన ట్విస్ట్ ని మేకర్స్ దాచి పెట్టారు. ఢీ షో అంటే డ్యాన్స్ తో పాటు ఒకప్పుడు కామెడీ కూడా గుర్తుకు వచ్చేది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ కలిసి యాంకర్ ప్రదీప్ తో చేసే కామెడీ కి మామూలు క్రేజ్ ఉండేది కాదు. కేవలం వీళ్ళ కామెడీ కోసమే ఈ షో ని చూసే ఆడియన్స్ లక్షల్లో ఉండేవాళ్ళు. అయితే సుడిగాలి సుధీర్ , రష్మీ ఈ షో నుండి తప్పుకోవడం తో , కేవలం హైపర్ ఆది మాత్రమే గత సీజన్ వరకు కొనసాగుతూ వచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, సుడిగాలి సుధీర్ కూడా ఈ షో లో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అట. హైపర్ ఆది కూడా ఈ షో లో ఉంటాడట.
‘ఢీ ‘ షో కి ఓజీ కాంబినేషన్ గా పిలవబడే వీళ్లంతా ఒక్క చోట చేరారు. ఇక ఫన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే సుడిగాలి సుధీర్ రీసెంట్ గా జబర్దస్త్ లో కూడా ఒక స్పెషల్ స్కిట్ లో కనిపించాడు. దీనికి సంబంధించిన ప్రోమో ని చూసి , సుధీర్ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అసలు నిజం ఏమిటంటే, ఆయన కేవలం ఒకే ఒక్క స్కిట్ లో కనిపించడం కోసం వచ్చాడంటే. ఆ తర్వాత మళ్లీ రాలేదు. ఇప్పుడు ఢీ లో కూడా కేవలం ఒక్క ఎపిసోడ్ కి మాత్రమే పరిమితం అవుతాడా?, లేదంటే రెగ్యులర్ గా కొనసాగుతాడా అనేది చూడాలి.