Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ తో ‘కాకా’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత , మళ్లీ వీల్లద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో , ఈ చిత్రం పై అంచనాలు ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లోనే ఉన్నాయి. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అవ్వడం కూడా, ఈ సినిమా పై హైప్ పెరగడానికి ఒక కారణం అయ్యింది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి కూతురుగా మలయాళం యుంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ నటిస్తోంది. నిన్న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
కథ విషయానికి వస్తే , అనశ్వర రాజన్ ఒక మెడికల్ స్టూడెంట్. ఆమె చదువుతున్న కాలేజ్ లో కొన్ని సమస్యల్లో చిక్కుకొని తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటుంది. తన కూతురు కష్టాలను ఎదిరించడం కోసం , మెగాస్టార్ చిరంజీవి తనలోని పాత మనిషిని నిద్ర లేపుతాడు. ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి పెద్ద గ్యాంగ్ స్టర్ , ఈ పార్ట్ సినిమాలో వేరే లెవెల్ లో ఉంటుందని , యాక్షన్ నెవెర్ బిఫోర్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. చిరంజీవి కెరీర్ లోనే ఈ చిత్రం ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని అంటున్నారు. వింటేజ్ మెగాస్టార్ మార్క్ ని ‘జైలర్’ మూవీ స్టైల్ లో ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో , అలా ఉంటుందట ఈ చిత్రం. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మరోసారి రీజనల్ ఇండస్ట్రీ ని అందుకుంటాడని అంటున్నారు విశ్లేషకులు.
ఇకపోతే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అని అనిపించే రేంజ్ లో ఉంది ఈ గ్లింప్స్ వీడియో. సినిమా కూడా అలాగే ఉంటే మెగాస్టార్ ఈసారి 400 కోట్ల గ్రాస్ ని కచ్చితంగా కొల్లగొడుతాడని అంటున్నారు నెటిజెన్స్. చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏ మాత్రం అందుకుంటుంది అనేది.