Dhee 21 Show: ఈటీవీ లో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న టీవీ షోస్ లో ఒకటి ‘ఢీ’. ఈ డ్యాన్స్ షో విజయవంతంగా 20 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. 20 వ సీజన్ పూర్తి అయ్యాక కొంత గ్యాప్ తీసుకొని , మళ్లీ సరికొత్త సీజన్ ని మొదలు పెడుతామని చెప్పారు. చెప్పనైతే చెప్పారు కానీ , ఈ సీజన్ అంత తేలికగా మొదలు అవ్వదు , అసలు ‘ఢీ’ ప్రస్థానం ఇక ముగిసినట్టే అని చాలా మంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే ‘ఢీ 21’ సీజన్ త్వరలోనే రాబోతుంది అంటూ గత కొద్దిరోజుల క్రితమే ఒక లోగో ని విడుదల చేశారు. దీంతో ‘ఢీ ‘ ఫ్యాన్స్ సంతోషించారు. ఇకపోతే నిన్న ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ నెల 19 నుండి ఈ సీజన్ ప్రారంభం కానుంది.
ఈటీవీ తో పాటు, నెట్ ఫ్లిక్స్, ఈటీవీ విన్ యాప్స్ లో ఈ షో ని చూడొచ్చు. అయితే నిన్న విడుదల చేసిన ప్రోమో లో జడ్జీలుగా అనుపమ పరమేశ్వరన్ , జానీ మాస్టర్ లను చూపించగా, హోస్ట్ గా యాంకర్ ప్రదీప్ ని చూపించారు. అదే విధంగా ఈ షో కి సంబంధించిన కొరియోగ్రాఫర్స్ ని కూడా ఈ ప్రోమో లో చూపించారు. కానీ హైపర్ ఆది ని మాత్రం ప్రోమో లో చూపించలేదు. ఢీ జోడి సీజన్ నుండి సుడిగాలి సుధీర్ , రష్మీ టీం లీడర్స్ గా వ్యవహరిస్తూ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వర్షిణి , హైపర్ ఆది, దీపికా పిల్లి జాయిన్ అయ్యారు. వీరిలో హైపర్ ఆది తప్ప , మిగిలిన వాళ్ళు తర్వాతి సీజన్స్ లో కనిపించలేదు. కానీ హైపర్ ఆది గత సీజన్ వరకు రెగ్యులర్ గా పని చేశాడు.
అయితే నిన్న విడుదల చేసిన ప్రోమో లో హైపర్ ఆది కనిపించకపోవడం తో , ఆయన సీజన్ లో పాల్గొనడం లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతం లో ప్రదీప్ , హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ కలిసి చేసే కామెడీ కి మామూలు రేంజ్ క్రేజ్ ఉండేది కాదు. కేవలం వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఫన్ కోసమే కోట్లాది మంది ప్రేక్షకులు ఈ షో ని వీక్షించేవారు. ఇప్పుడు ప్రదీప్ రీ ఎంట్రీ ఇచ్చాడు , హైపర్ ఆది ఎలాగో ఉంటాడు, కాబట్టి వింటేజ్ కామెడీ రెడీ అవ్వబోతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రోమో లో హైపర్ ఆది లేకపోవడం చూసి అభిమానులు నిరాశకు గురయ్యారు. మరి హైపర్ ఆది ఉన్నాడా లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 19 వరకు ఆగాల్సిందే.