Homeఎంటర్టైన్మెంట్Kaaka vs Viswambhara: 'కాకా' తో పోటీ పడనున్న 'విశ్వంభర'.. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్...

Kaaka vs Viswambhara: ‘కాకా’ తో పోటీ పడనున్న ‘విశ్వంభర’.. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్!

Kaaka vs Viswambhara: ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి , బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. రీసెంట్ గానే మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ‘జైలర్’ తరహా సబ్జెక్టు ని ఎంచుకున్నాడు. ఈసారి ఏకంగా 400 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టబోతున్నాడు […]

Kaaka vs Viswambhara: ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి , బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. రీసెంట్ గానే మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ‘జైలర్’ తరహా సబ్జెక్టు ని ఎంచుకున్నాడు. ఈసారి ఏకంగా 400 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టబోతున్నాడు అని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. జనవరి 13 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి పోటీ గా చిరంజీవి మరో మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘విశ్వంభర’ రాబోతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. ఎప్పుడో 2023 వ సంవత్సరం లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , కొన్ని అనుకోని కారణాల వల్ల , ఇప్పటి వరకు విడుదల నోచుకోలేకపోయింది.

VFX వర్క్ పట్ల డైరెక్టర్ వశిష్ఠ ఇప్పుడు పూర్తిగా సంతృప్తి చెందడం తో , ఈ సినిమా ఫైనల్ కాపీ ని లాక్ చేశారట. ఇక కేవలం ఓటీటీ డీల్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. అది లాక్ అయ్యాక ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారట మేకర్స్. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ఈ చిత్రాన్ని జనవరి 9 న విడుదల చేయబోతున్నారట. అంటే ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమాకు చిరంజీవి సినిమానే పోటీ పడబోతోంది అన్నమాట. గతం లో ఇలాంటి సందర్భం కేవలం నందమూరి బాలకృష్ణ విషయం లో మాత్రమే జరిగింది. ఆయన హీరో గా నటించిన బంగారు బుల్లోడు , నిప్పు రవ్వ చిత్రాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ విషయం లో కూడా అదే సీన్ రిపీట్ అవ్వనుందా ? లేదా అనేది చూడాలి.

అయితే ‘విశ్వంభర’ వస్తే , ‘కాకా’ చిత్రం వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చిరంజీవి కూడా ‘విశ్వంభర’ విడుదలకు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమా పూర్తి అయ్యి రెండేళ్లు కావ్వొస్తుంది. నిర్మాతకు భారీ రేంజ్ లో వడ్డీలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రీకవర్ అవ్వాలంటే కచ్చితంగా సంక్రాంతి సీజన్ కి రావడమే కరెక్ట్ అనే ఉద్దేశ్యం లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ‘కాకా’ చిత్రం సమ్మర్ కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper