Homeఎంటర్టైన్మెంట్Dhee Raju Arrest: 'ఢీ 20' టైటిల్ విన్నర్ 'రాజు' అరెస్ట్.. పూర్తి వివరాలు చూస్తే...

Dhee Raju Arrest: ‘ఢీ 20’ టైటిల్ విన్నర్ ‘రాజు’ అరెస్ట్.. పూర్తి వివరాలు చూస్తే మీ రక్తం మరిగిపోతాది!

Dhee Raju Arrest: ఈటీవీ లో ప్రసారం అవుతున్న ‘ఢీ’ షో ద్వారా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించిన వారిలో ఒకరు రాజు. 20 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో లో రాజు తన డ్యాన్స్ స్టైల్ లో ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ‘ఢీ 10’ టైటిల్ విన్నర్ గా నిల్చిన ఆయన, గత సీజన్ లో కూడా టైటిల్ విన్నర్ గా నిల్చి చరిత్ర […]

Dhee Raju Arrest: ఈటీవీ లో ప్రసారం అవుతున్న ‘ఢీ’ షో ద్వారా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించిన వారిలో ఒకరు రాజు. 20 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో లో రాజు తన డ్యాన్స్ స్టైల్ లో ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ‘ఢీ 10’ టైటిల్ విన్నర్ గా నిల్చిన ఆయన, గత సీజన్ లో కూడా టైటిల్ విన్నర్ గా నిల్చి చరిత్ర సృష్టించాడు. రీసెంట్ గానే ఇతనికి ఒక సినిమాలో హీరో గా నటించే అవకాశం కూడా వచ్చింది. కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తుంది అనుకునేలోపే అతని జీవితం లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, తనని లైంగికంగా వేధించాడని ఒక అమ్మాయి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.

ఈ కంప్లైంట్ ని స్వీకరించిన పోలీసులు , రాజు పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి ఈ నెల 9 న అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరు పర్చగా, న్యాయమూర్తి ఇతనికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం రిమాండ్ కస్టడీ లో ఉన్న రాజు ని పోలీసులు విచారిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సెప్టెంబర్ 9 న రాజు ని అరెస్ట్ చేస్తే , ఇన్ని రోజులు బయటకు రానివ్వకుండా ఎందుకు గోప్యంగా ఉంచారు?, ఈ విషయం బయటకు వస్తే , పెద్ద వాళ్ళు చొరవ తీసుకొని అతనికి బెయిల్ మంజూరు చేయిస్తారనే ఇలా చేశారా?, పైగా ఈమధ్య డ్యాన్సర్స్ అసోసియేషన్ లో గొడవలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రాజు పై కుట్రలు చేసి కావాలని ఈ కేసులో ఇరికించారా ? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనికి సమందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ నెల 18 నుండి ఈటీవీ లో ‘ఢీ 21’ షో ప్రారంభం కానుంది. ఈ షో లో కూడా రాజు పాల్గొంటాడని ఆయన అభిమానులు ఆశించారు. కానీ అది జరగడం లేదు. మరి రాజు నిజంగానే మోసం చేశాడా?, అతని ముఖం చూస్తుంటే అలా అనిపించడం లేదే?, చూడాలి మరి రాబోయే రోజుల్లో ee కేసుకి సంబంధించి ఎలాంటి నిజాలు బయటకు రాబోతున్నాయి అనేది. జానీ మాస్టర్ లాంటోడే అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ అరెస్ట్ తో ఆయన కెరీర్ కి ఎండ్ పడిందని అంతా అనుకున్నారు , కానీ ఇప్పుడు కం బ్యాక్ ఇచ్చి , మళ్లీ తన కింగ్ స్థానం లోకి వెళ్లి కూర్చున్నాడు. రాజు కూడా అలా బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper