Spirit Movie Update: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక అత్యుత్తమమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికి ఆయనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకున్నాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుందనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా విషయం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతోంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు…
Also Read: భారీ రిస్క్ చేస్తున్న ‘రాజా సాబ్ ‘ నిర్మాతలు..వణికిపోతున్న ఫ్యాన్స్!
ఇక రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డులను సైతం బద్దలు కొట్టగలిగే కెపాసిటి సందీప్ రెడ్డి వంగకి ఉందని అది స్పిరిట్ సినిమాతో సాధ్యమవుతుందని సందీప్ రెడ్డి అభిమానులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… రాజమౌళి సైతం తనకు పోటీని ఇవ్వగలిగే కెపాసిటి సందీప్ రెడ్డి వంగకి మాత్రమే ఉందని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఇక దానికి అనుగుణంగానే ఇప్పుడు రాజమౌళి రికార్డులను సైతం సందీప్ రెడ్డివంగా బ్రేక్ చేయబోతున్నాడు. అనేది చాలా క్లారిటీగా తెలుస్తోంది. రెండువేల కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టినట్లయితే రాజమౌళి రికార్డును చెరిపేసి తను ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడు. మరి ఆ రికార్డును కనక బ్రేక్ చేయకపోతే మాత్రం సందీప్ మళ్లీ వెనకబడిపోతాడనే చెప్పాలి…
ప్రస్తుతం రాజమౌళి సైతం ‘వారణాసి’ మూవీ తో మరోసారి తన పంజా దెబ్బ ను రుచి చూపించాలని చూస్తున్నప్పటికి ఆయన సినిమా వచ్చేసరికి ఇంకా సమయం పడుతోంది. కాబట్టి ఈ లోపు సందీప్ స్పిరిట్ సినిమాని రిలీజ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నాడు…చూడాలి మరి సందీప్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…