Union Bank: జీవితమంతా అనేక కష్టాలు ఎదుర్కొని.. ఆర్థిక స్థిరత్వం సాధించిన తర్వాత.. బాధ్యతలు మొత్తం తీరిపోయిన తర్వాత.. సీనియర్ సిటిజన్లకు చేతిలో అంతగా డబ్బు ఉండదు. ఈ సమయంలో వచ్చే అనారోగ్యాలు.. ఇతర సమస్యలు వారిని ఇబ్బంది పడతాయి. పైగా కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోరు. ఇలాంటి సమయంలో అలాంటి వారి కోసం యూనియన్ బ్యాంక్ స్పెషల్ స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ స్కీమ్స్ ఎలా ఉన్నాయి.. వాటిలో పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుంది.. వడ్డీ రేటు ఎలా ఉంది ఈ కథనంలో తెలుసుకుందాం .
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో సీనియర్ సిటిజన్లకు ఉపయోగపడే మంచి పొదుపు, పెట్టుబడి పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారు తమ డబ్బుకు భద్రతతో పాటు మంచి వడ్డీ, నెలవారి లేదా త్రైమాసిక ఆదాయం పొందాలనుకుంటే కొన్ని పథకాలను పరిశీలించవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (SCSS)
ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పొదుపు పథకం. యూనియన్ బ్యాంక్ ద్వారా కూడా ఖాతా మొదలు పెట్టవచ్చు. అర్హత సాధారణంగా 60 ఏళ్ళు వయసు పైబడినవారు. పెట్టుబడి కాలం ఐదు సంవత్సరాలు. మరో మూడు సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. వడ్డీ త్రైమాసికానికి ఒకసారి చెల్లిస్తారు. గరిష్ట పెట్టుబడి పరిమితి 30 లక్షలు. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. యూనియన్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం 2026 జూన్ 30 వరకు ఏడాదికి 8.20 % వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించింది
సీనియర్ సిటిజన్ ఫిక్స్ డ్ డిపాజిట్ (FD)
డబ్బుకు భద్రతతో పాటు నిర్ణీత వడ్డీ ఆదాయం కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. 60 ఏళ్ళు నిండిన వారికి సాధారణ ఎఫ్ డీ వడ్డీ పై అదనంగా 0.50 శాతం లభిస్తుంది. 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.75 శాతం లభిస్తుంది.. ఐదు కోట్ల వరకు దేశీయ టర్మ్ డిపాజిట్లకు ఈ అదనపు వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. వడ్డీ ని నెలవారీ, త్రైమాసిక లేదా మెచ్యూరిటీ సమయంలో పొందే అవకాశాలను డిపాజిట్ నిబంధన ప్రకారం ఎంచుకోవచ్చు. నవంబర్ 21, 2026 వరకు ప్రకటించిన రేట్లపై అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 555 రోజుల ఎఫ్డీ కి సీనియర్ సిటిజన్ లకు 7.30 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. డిపాజిట్ చేసిన రోజున బ్రాంచ్లో తాజా రేటును నిర్ధారించుకోవాలి.
యూనియన్ సమ్మాన్ సేవింగ్స్ అకౌంట్
పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగుల కోసం యూనియన్ బ్యాంకు రూపొందించిన ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్ ఇది. పెన్షన్ జమ చేసుకోవడానికి జీరో బ్యాలెన్స్ సదుపాయం. ఉచిత పాస్ బుక్.. నెలవారి స్టేట్మెంట్.. ఉచిత రూపే డెబిట్ కార్డ్.. లాకర్ అద్దెలో రాయితీ.. బ్యాంకులో ప్రాధాన్యతతో సేవలు.. ఉచిత హెల్త్ చెకప్.. ఉచిత డోర్ స్టెప్ బ్యాకింగ్ 12+1 సార్లు ఏడాదికి (గుర్తించిన ప్రాంతాలలో).. అయితే ఈ పథకం కేవలం పెన్షనర్ల కోసం మాత్రమే.. ప్రతి సీనియర్ సిటిజన్ కు ఆటోమెటిక్ గా వర్తించదు.
మంత్లీ ఇన్కమ్ స్కీమ్
ప్రతినెలా కొంత ఆదాయం రావాలి అని కోరుకునే వారికి యూనియన్ బ్యాంకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. పథకం నిబంధనల ప్రకారం నెలవారీ వడ్డీ ఆదాయం పొందవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఈ పథకానికి వర్తించే వడ్డీ రేటు.. కాల పరిమితి.. కనీస డిపాజిట్ వివరాలు బ్రాంచ్లో తెలుసుకోవాలి..
పెట్టుబడి పథకాలతో పాటు బ్యాంకింగ్ సేవల్లో కొన్ని ప్రయోజనాలున్నాయి. ప్రత్యేక కౌంటర్ లో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ 70 ఏళ్లు పైబడిన వారికి అవకాశం ఉంటుంది. లైవ్ సర్టిఫికెట్ బ్యాంకు బ్రాంచీలలో సమర్పించవచ్చు. చెక్ బుక్ కనీసం ఏడాదికి ఒకటి ఇస్తారు. సీనియర్ ఎకౌంట్ ను వయసు 60 ఏళ్లు దాటినప్పుడు అర్హత ప్రకారం మార్చుతారు. డోర్ స్టెప్ బ్యాంకింగ్ లో నగదు డిపాజిట్.. విత్ డ్రాయల్.. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ వంటి సేవలు ఉన్నాయి. ఒక్కొక్క సేవకు రూ.75+ జీఎస్టీ చార్జి ఉంటుంది.