spot_img
Homeఆధ్యాత్మికంToday 3 December 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు శుభవార్త..

Today 3 December 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు శుభవార్త..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంశాలు పొందుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈరోజు అంతా కలిసి వస్తుంది. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. శక్తి సమాచారం ప్రదర్శించడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బంధువులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే సక్సెస్ అవుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే పెద్దలను సంప్రదించాలి. ఆన్లైన్లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : మీ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న వివాదాల నుంచి బయటపడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. విద్యార్థులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉన్నట్లుండి ఆదాయం పెరుగుతుంది. దీంతో మానసికంగా సంతోషంగా ఉంటారు

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఉద్యోగులు ప్రశంశాలను పొందుతారు. అందరికీ పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కోర్టులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా దూరపు ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు ఇవి లాభాలు ఇస్తాయి. ఉద్యోగులు పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. చాలామంది ధన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. లక్ష్యాలను నిర్దేశించి వాటిని పూర్తి చేయడానికి కష్టపడతారు. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. స్నేహితుల కోసం ధన సహాయం చేస్తారు. వ్యాపారులు కొత్త భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనువైన వాతావరణం ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు గతంలో చేపట్టిన లక్ష్యాలను ఈరోజు పూర్తి చేస్తారు. విద్యార్థులు భవిష్యత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు అన్ని రకాలుగా శుభప్రదంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు శారీరకంగా దృఢంగా ఉంటారు. దీంతో అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. గురువుల మద్దతుతో విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొనే విజయం సాధిస్తారు. స్నేహితులకు డబ్బు ఇస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుడు సహాయంతో ధన సహాయం పొందుతారు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . కొన్ని రంగాల వ్యాపారులు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడంతో లక్ష్యాలను పూర్తిచేస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. చేసే పని సక్సెస్ కావడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper