Spirit Movie: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నా కూడా కొంతమందికి మాత్రమే ఇక్కడ గొప్ప ఇమేజ్ దక్కుతుంది. వాళ్ళు చేసే సినిమాలు, వాళ్ళు స్క్రీన్ మీద హీరోలను చూపిస్తున్న స్టైల్ ప్రతిది ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి వారికి మాత్రమే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లుగా హోదా దక్కుతుంది. అలాంటి వారిలో సందీప్ రెడ్డివంగా ఒకరు…’అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత చేసిన ‘అనిమల్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులందరిని అలరించారు. అలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ప్రతి ఒక్కరి నోట ఆయన పేరు వినిపించేలా పెను ప్రభంజనాలను క్రియేట్ చేశాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం.
ఇప్పటివరకు తను చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే స్పిరిట్ సినిమాలో రెండు సీన్లు హైలెట్ గా నిలువబోతున్నాయట.
ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశంలో యాక్షన్ ఎపిసోడ్ ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుందని యాక్షన్ విత్ ఎమోషన్ తో ఇంటర్వెల్ కార్డు పడుతుందని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ లో వచ్చే రెయిన్ ఫైట్ సినిమా మొత్తానికి హైలైట్ అవ్వబోతుందట. అందులో ప్రభాస్ కండ్లకి గంతలు కట్టి ఈ ఫైట్ ను చేయిస్తున్నారట. ఈ ఫైట్ ను రీసెంట్ గా షూట్ చేశారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఈ ఫైట్ సీక్వెన్స్ మొత్తానికి థియేటర్లో ప్రేక్షకుడు పూనకాలతో ఊగిపోతారు అంటూ స్పిరిట్ సినిమా యూనిట్ నుంచి కొన్ని లీకేజీలైతే వస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ సినిమాని 2027 మార్చి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి మూవీ ఎలా ఉంటుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…