Samsung Galaxy S27 Pro : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న శాంసంగ్.. గెలాక్సీ ఎస్ సిరీస్‌లో మరో కీలక మార్పునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బేస్, ప్లస్, అల్ట్రా మోడళ్లతో కొనసాగిన ఈ సిరీస్‌లో తొలిసారిగా ప్రో వేరియంట్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే Samsung Galaxy S27 Pro. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించి భారత్‌లో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కనిపించడం త్వరలోనే భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశాలను బలపరుస్తోంది.
అల్ట్రా ఫీచర్లు.. కాంపాక్ట్ డిజైన్‌తో ప్రో మోడల్?
గెలాక్సీ ఎస్ సిరీస్‌లో అల్ట్రా మోడల్ అత్యుత్తమ ఫీచర్లతో వస్తున్నప్పటికీ.. దాని పెద్ద డిస్‌ప్లే, భారీ డిజైన్ కొంతమంది వినియోగదారులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో అల్ట్రా తరహా ప్రీమియం అనుభూతిని కొంత చిన్న పరిమాణంలో అందించడమే లక్ష్యంగా గెలాక్సీ ఎస్27 ప్రోను తీసుకొచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.47 అంగుళాల M16 OLED డిస్‌ప్లే ఉండొచ్చు. 2K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అంటే చిన్న సైజులోనే ప్రీమియం డిస్‌ప్లే అనుభూతిని అందించే అవకాశం ఉంది.
200MP కెమెరాతో ఫొటోగ్రఫీకి పెద్దపీట!
కెమెరా విభాగంలోనూ శాంసంగ్ ఎలాంటి రాజీ పడకపోవచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చని తెలుస్తోంది. దీనికి అదనంగా 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 12MP లేదా 5MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాను అందించే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చని సమాచారం.
Exynos 2700 చిప్‌సెట్.. Android 17తో రాక?
పనితీరు విషయంలోనూ ఈ ఫోన్ ఆకట్టుకునే అవకాశాలున్నాయి. ఇటీవల గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై కనిపించిన వివరాల ప్రకారం.. ఇందులో శాంసంగ్ సొంత Exynos 2700 ప్రాసెసర్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. 12GB ర్యామ్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి రావొచ్చు.
గీక్‌బెంచ్ పరీక్షల్లో సింగిల్ కోర్ విభాగంలో 3,061 పాయింట్లు, మల్టీ కోర్ విభాగంలో 10,967 పాయింట్లు సాధించినట్లు లీకులు వెల్లడిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు One UI 9.5 ఇంటర్‌ఫేస్‌ను అందించే అవకాశం ఉంది.
బ్యాటరీ, ఛార్జింగ్ విషయంలోనూ ప్రత్యేకత
Galaxy S27 Proలో 5,240mAh బ్యాటరీ ఉండొచ్చని సమాచారం. 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఇవ్వనున్నట్లు లీకులు చెబుతున్నాయి. అయితే ఈ మోడల్‌లో ఎస్ పెన్ సపోర్ట్ ఉండదని తెలుస్తోంది. దీంతో ఎస్ పెన్ వినియోగాన్ని కోరుకునేవారు అల్ట్రా మోడల్ వైపు చూడాల్సి రావచ్చు.
జనవరి 2027లో లాంచ్?
శాంసంగ్ గెలాక్సీ ఎస్27 సిరీస్‌ను జనవరి 2027లో ఆవిష్కరించే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఇందులో Galaxy S27, Galaxy S27+, Galaxy S27 Ultraతో పాటు కొత్తగా Galaxy S27 Pro కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
BIS సర్టిఫికేషన్ జాబితాలో SM-S957B మోడల్ నంబర్‌తో కనిపించిన ఈ ఫోన్ భారత మార్కెట్లోకి కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే శాంసంగ్ ఇప్పటివరకు అధికారికంగా లాంచ్ తేదీ, ధర, ఫీచర్లను ప్రకటించలేదు.
అల్ట్రా మోడల్‌లోని ప్రీమియం ఫీచర్లను కోరుకుంటూ, మరీ పెద్ద ఫోన్‌ను ఇష్టపడని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని శాంసంగ్ ఈ ప్రో వేరియంట్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంచనాలు నిజమైతే గెలాక్సీ ఎస్ సిరీస్‌లో కొత్త ప్రో మోడల్ శాంసంగ్‌కు మరో కీలక మార్కెట్ విస్తరణగా మారవచ్చు.