The Raja Saab Producers: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Movie) జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని నార్త్ అమెరికా లో నేడు ప్రారంభించారు. కేవలం 65 షోస్ ని షెడ్యూల్ చేయగా, దాదాపుగా 8 వేల డాలర్లు వచ్చాయి. ఇది గొప్ప ఆరంభం అనే చెప్పాలి. ఈమధ్య కాలం లో ఏ సినిమా కూడా విడుదల అవ్వని రేంజ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. నిర్మాత ఐమాక్స్,డీ బాక్స్,ఐస్, 4dx , ఎపిక్, డాళ్బీ విజన్, ఇలా అన్ని ఫార్మట్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ నుండి మంచి గ్రాస్ ని రాబడుతుందని అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఇది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమా రన్ టైం దాదాపుగా 3 గంటల 15 నీంసిహాల వరకు ఉంటుందట. ఈ రన్ టైం ని చూసి అభిమానులు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ రేంజ్ రన్ టైం ఉన్న సినిమాలకు అత్యధిక షోస్ దొరకడం కష్టం. అంతే కాకుండా ఒక సినిమాకు ప్రేక్షకుడు 3 గంటలకు పైగా సమయం కేటాయించాలంటే కచ్చితంగా ఆలోచిస్తాడు. కాబట్టి ఆ రేంజ్ రన్ టైం సినిమాకు డేంజర్, రెండు గంటల 45 నిముషాల రన్ టైం పెడితే కచ్చితంగా అదిరిపోతోంది. కావాల్సినన్ని షోస్ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్స్ గా నిల్చిన వాటిల్లో అత్యధిక శాతం రెండు గంటల 45 నిమిషాల రన్ టైం ఉన్నవే. అయితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాక, కచ్చితంగా రన్ టైం కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుంది అనేది.