Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: ఇది కలా? నిజామా?..సెన్సేషనల్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..సెప్టెంబర్ 2న...

Pawan Kalyan: ఇది కలా? నిజామా?..సెన్సేషనల్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..సెప్టెంబర్ 2న ఫ్యాన్స్ కి పండగే!

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్స్ ని తలచుకుంటేనే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఈ కాంబినేషన్ లో సినిమా పడితే పరిస్థితి ఏంటి?, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఒక్కటైనా మిగులుతుందా?, అసలు ఆ ఊహనే వేరే లెవెల్ లో అనిపిస్తోంది అని అనిపించే కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కాంబినేషన్ ని సెట్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పాన్ ఇండియా […]

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్స్ ని తలచుకుంటేనే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఈ కాంబినేషన్ లో సినిమా పడితే పరిస్థితి ఏంటి?, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఒక్కటైనా మిగులుతుందా?, అసలు ఆ ఊహనే వేరే లెవెల్ లో అనిపిస్తోంది అని అనిపించే కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కాంబినేషన్ ని సెట్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ తో, రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఒక సినిమాని లాక్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిసున్న మాట. సందీప్ వంగ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అనేక ఇంటర్వ్యూస్ లో తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ అంటూ స్వయంగా సందీప్ వంగ చెప్పుకొచ్చాడు. వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క సినిమా పడితే చాలా బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పొలిటికల్ బిజీ కారణంగా, అది సాధ్యపడలేదు. అయితే 2029 లోపు తన వైపు నుండి రెండు సినిమాలను అభిమానులకు అందించాలనే పట్టుదలతో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ‘ఓజీ 2’ ఇప్పటికే ఖరారు అయ్యింది. అయితే ఇది భారీ యాక్షన్ సినిమా కావడంతో పాటు, పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ జరగడంతో , అలాంటి యాక్షన్ సినిమాని ఇప్పట్లో చేయలేని పరిస్థితి ఉండడం వల్ల, ఒక పొలిటికల్ థ్రిల్లర్ జానర్ సినిమా చెయ్యాలని ఆయన ఫిక్స్ అయ్యాడు, అందుకు సందీప్ వంగ అయితేనే కరెక్ట్ అని భావించి, అతన్ని ఈ సబ్జెక్టు కి లాక్ చేసినట్టు సమాచారం.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఓజీ 2’ నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఎలాంటి అప్డేట్ లేదని రీసెంట్ గా తెలిసింది. దీంతో అభిమానులు కృంగిపోయారు. అయితే ఇప్పుడు ‘ఓజీ 2’ అప్డేట్ కి బదులుగా, సందీప్ వంగ తో సినిమాని ప్రకటించబోతున్నారట. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. అయితే ఇది కేవలం అభిమానులు పుట్టించిన పుకారు మాత్రమేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మరో టాక్. చూడాలి మరి ఏమి జరగబోతుందో అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper