Prabhas: లాక్ డౌన్ తర్వాత ఈమధ్య కాలం లో విడుదలైన సినిమాల్లో యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షించిన సినిమాల లిస్ట్ తీస్తే, అందులో ‘యానిమల్’ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా , ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓటీటీ లో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎగబడి చూశారు. భవిష్యత్తులో యానిమల్ సినిమా వసూళ్లను దాటే సినిమాలు చాలానే రావొచ్చు, కానీ ఇంతటి బోల్డ్ సినిమాని మళ్లీ చూడడం కష్టమేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ డైరెక్టర్ సందీప్ వంగ మాత్రం అసలు తగ్గడం లేదు.
ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ చిత్రం యానిమల్ కంటే బోల్డ్ గా ఉంటుందట. ఈ చిత్రానికి సంబంధించి అత్యధిక శాతం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగింది. ముఖ్యంగా విమల్ థియేటర్ లో ప్రభాస్ పై తీసిన కొన్ని యాక్షన్ సన్నివేశం చాలా బోల్డ్ గా ఉంటుందట. ఈ సన్నివేశం లో ప్రభాస్ బట్టలు లేకుండా కనిపిస్తాడట. ఇలాంటి సన్నివేశాన్ని చేయడానికి ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఏ సూపర్ స్టార్ కూడా సాహసం చేయలేదట. ఒక స్టార్ హీరో అయ్యుండి, ఇలాంటి సన్నివేశం లో నటించినందుకు విడుదల తర్వాత ప్రభాస్ పై విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తారని అంటున్నారు. అంతలా ఈ సన్నివేశం లో ఏముంది ?, నిజంగానే ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించే రేంజ్ లో ఉంటుందా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది మార్చి 5 వరకు ఆగాల్సిందే.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ 50 శాతం కి పైగా పూర్తి అయ్యిందట. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. డిసెంబర్ 3 న ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాని విడుదల చేయబోతున్నామని ఇది వరకే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. కానీ ఆ సమయానికి విడుదల అవ్వడం దాదాపుగా కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉందట. అందుకే ఈ సినిమాని రిపబ్లిక్ డే రోజున విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారట మేకర్స్. ఒకవేళ అదే కనుక జరిగితే, మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ లో ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.