Dhee 21 Show: నిన్న గాక మొన్ననే మొదలైనట్టుగా అనిపిస్తున్న ‘ఢీ 21’ షో ముగిసింది. తొలుత ఈ షో జానీ మాస్టర్, అనుపమ పరమేశ్వరన్ లతో మొదలైంది. జానీ మాస్టర్ మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కి మిస్ అయ్యాడు కానీ, గత నాలుగు వారాల నుండి ఆయన నాన్ స్టాప్ గా పాల్గొంటూ వస్తున్నాడు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఈ షో లో జడ్జి గా కేవలం నాలుగు వారాలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఆమె ఈ షో నుండి లెఫ్ట్ అవ్వగా, ఆమె స్థానం లోకి రెజీనా వచ్చింది. ఇక హైపర్ ఆది కూడా మొదట్లో లేడు కానీ, గత నాలుగైదు ఎపిసోడ్స్ నుండి మాత్రం రెగ్యులర్ గా కనిపిస్తూ వచ్చాడు. ఇక కొరియోగ్రాఫర్స్ మధ్య వాడావేడి చర్చలు. కంటెస్టెంట్స్ హోరాహోరీ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లు ఈ షో ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.
ఇకపోతే లక్షలాది మంది ప్రేక్షకుల ఎదురు చూపులకు ఎట్టకేలకు తెరపడింది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా ఆర్నాల్డ్ నిలిచాడు. యశ్వంత్ మాస్టర్ నేతృత్వం లో ఆర్నాల్డ్ మొదటి నుండి తన అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ వచ్చాడు. ఇక ఫైనల్స్ లో అయితే కృష్ణ మాస్టర్ నేతృత్వంలో వచ్చిన అనుష్క ఆర్నాల్డ్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఇక టైటిల్ గెలుచుకున్న ఆర్నాల్డ్ కి ఈటీవీ డైరెక్టర్ సుజయ్ 75 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ ని అందించాడు. ఆర్నాల్డ్ వంటి ప్రతిభ గల వాళ్ళని మా ఈటీవీ ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటుందని, ఇన్ని సీజన్స్ కి తోడుగా వ్యవహరిస్తూ మాతో పాటు ప్రయాణం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా సుజయ్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా ఈ షో తో యశ్వంత్ మాస్టర్ అరుదైన రికార్డు ని నెలకొల్పాడు. ఢీ షో లో ఏకంగా నాలుగు సీజన్స్ కి టైటిల్ విన్నర్ గా నిల్చిన ఏకైక కొరియోగ్రాఫర్ గా యశ్వంత్ మాస్టర్ చరిత్ర సృష్టించాడు.