Child Future Planning: ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉంటాయి. మంచి చదువు తెప్పించాలని.. ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలని.. జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని భావిస్తుంటారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులను చూస్తుంటే మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది పెద్ద సవాల్ గా మారుతోంది. ముఖ్యంగా పిల్లలు పెద్దయ్య సమయానికి కాలేజీ ఫీజులు.. ఉన్నత విద్య ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మ్యూచువల్ ఫండ్లలో SIP పెట్టుబడులు ఒక మార్గం లాగా ఉపయోగపడొచ్చు
సాధారణ SIP కంటే step up SIP ఎందుకు ప్రత్యేకం
సాధారణంగా చాలామందికి SIP గురించి తెలుసు. ప్రతినెలా ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడాన్ని sip అంటారు. ఉదాహరణకు నెలకు 5000 చొప్పున 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రతి నెల అదే మొత్తం కొనసాగుతుంది. అయితే స్టెప్ అప్ సిప్ లో మాత్రం ప్రతి సంవత్సరం పెట్టుబడి మొత్తాన్ని కొంత పెంచుకుంటూ వెళ్లవచ్చు. ఉదాహరణకు మొదటి సంవత్సరం నెలకు 5000 పెట్టుబడి పెడితే.. రెండో సంవత్సరం 5,500 లేదా 6000 లకు పెంచుకోవచ్చు. ఇలా ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడింది కూడా పెంచుకుంటూ వెళ్లే దీపి కాలంలో ఎక్కువ మొత్తంలో సంపద సృష్టించే అవకాశం ఉంటుంది.
ఏ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి
పిల్లల ఉన్నత విద్య వంటి విద్యుత్కాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలనుకునేవారు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల గురించి తెలుసుకోవాలి.
Nifty 50 index funds: నిఫ్టీ ఫిఫ్టీ లోనే ప్రముఖ కంపెనీల పనితీరును అనుసరిస్తాయి. మార్కెట్ సూజీ ఆధారంగా పెట్టుబడులు ఉంటాయి.
Flexi cap funds: పెద్ద, మధ్యస్థ, చిన్న కంపెనీలో పండు మేనేజర్ నిర్ణయం ప్రకారం పెట్టుబడులు పెడతాయి.
Mal cap funds: చిన్న కంపెనీలో పెట్టుబడులు పెడతాయి. వీటిలో దీర్ఘకాలంలో అధిక రావడానికి అవకాశం ఉన్నప్పటికీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఈ మూడు రకాల ఫండ్లలో ఒక నిర్దిష్ట నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రూపొందించుకోవచ్చు. అయితే ఏ ఫండ్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి.. రిస్కు తీసుకునే సామర్థ్యం.. పెట్టుబడి గరువు మీద ఆధారపడి ఉంటుంది.
పన్నులు ఎంత ఉంటాయి
మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టేవారు రాబడి తో పాటు పనుల గురించి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపై వచ్చే లాభాలకు వర్తించే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ను లెక్కలోకి తీసుకోవాలి. ఏడాదికి మించి పెట్టుబడింది కొనసాగించినప్పుడు వచ్చే లాభాలను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని పిలుస్తుంటారు. వర్తించే పన్ను నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల పెట్టుబడి విలువ ఎంత పెరిగిన దానితోపాటు పన్నులు పోను చేతికి ఎంత మొత్తం వస్తుందో కూడా లెక్కించుకోవాలి.
ధరలను మర్చిపోవద్దు
పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేవారు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదే ధరల పెరుగుదల.. 10 లక్షల ఖర్చు అయ్యే ఉన్నత విద్య.. మరో 15 సంవత్సరాల తర్వాత మరింత ఖరీదుగా మారవచ్చు. అందుకే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్న ఖర్చులను మాత్రమే లెక్కలోకి తీసుకోకుండా.. భవిష్యత్తు కాలంలో పెరిగే ఖర్చులను కూడా అంచనా వేయగలగాలి.
పిల్లల కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి
పిల్లల వయసు, ఉన్నత విద్యకు ఇంకా ఎన్ని సంవత్సరాలు సమయం ఉంది.. భవిష్యత్తులో ఎంత మొత్తం అవసరమవుతుంది అనే అంశాలను బట్టి సిప్ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. సాధారణ సిప్ తో పాటు స్టెప్ అప్ సిప్ ద్వారా ప్రతి సంవత్సరం పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లే లక్ష్యానికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి. గతంలో వచ్చిన రాబడులు భవిష్యత్తులోనూ వస్తాయని హామీ లేదు. కాబట్టి కేవలం అధిక రాబడుల అంచనాలతో కాకుండా సరైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. మొత్తంగా చెప్పాలంటే పిల్లల భవిష్యత్తు కోసం చివరి నిమిషంలో డబ్బు సమకూర్చుకోవడం కంటే చిన్న వయసు నుంచి పెట్టుబడులు ప్రారంభించడం మంచిది. ఆదాయం పెరిగేకొద్ది సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లడం.. ధరలు.. పన్నులు.. మార్కెట్ రిస్క్ లను లెక్కలోకి తీసుకోవడం ద్వారా పిల్లల ఉన్నత విద్యకు అవసరమైన నిధిని సమకూర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.
ముఖ్యగమనిక: ఈ కథనం కేవలం పాఠకులకు ఆర్థిక అవగాన కోసం మాత్రమే కథనం రూపంలో అందించాం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాం.